సహజ పరాజయం | Sahaja Yamalapalli loses in Womens 100 Charlottesville Open | Sakshi
Sakshi News home page

సహజ పరాజయం

Apr 24 2025 3:13 AM | Updated on Apr 24 2025 3:13 AM

Sahaja Yamalapalli loses in Womens 100 Charlottesville Open

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల డబ్ల్యూ100 చార్లోట్స్‌విల్లె ఓపెన్‌ టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించడంలో విఫలమైంది. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలోని చార్లోట్స్‌విల్లె నగరంలో ఈ టోర్నీ జరుగుతోంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 320వ స్థానంలో ఉన్న సహజ క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో 6–0, 6–1తో మరియా కరోలినా ఫెరీరా టర్చెటో (బ్రెజిల్‌)పై విజయం సాధించింది. 

అయితే క్వాలి ఫయింగ్‌ ఫైనల్‌ రౌండ్‌ మ్యాచ్‌లో సహజ 4–6, 1–6తో ప్రపంచ 556వ ర్యాంకర్‌ మరియా కొజి రెవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ 4 డబుల్‌ ఫాల్ట్‌ లు చేసింది. తన సర్వీస్‌ను ఏడుసార్లు కోల్పోయిన సహజ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసింది. 

సహజ ఫస్ట్‌ సర్వ్‌లో 17 పాయింట్లు, సెకండ్‌ సర్వ్‌లో 11 పాయింట్లు సాధించింది. పుణేలో ఈనెల తొలి వారంలో జరిగిన బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాక సహజ ఆడిన తొలి టోర్నీలో ఇదే కావడం గమనార్హం.  

Advertisement
 
Advertisement
Advertisement