IPL 2022: 'సెంచరీలు కాదు జట్టు గెలవడం ముఖ్యం.. చాలా సంతోషంగా ఉన్నా'

Ruturaj Gaikwad not distressed about getting out on 99 - Sakshi

ఐపీఎల్‌-2022లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో సీఎస్‌కే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సీస్‌కే ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో గైక్వాడ్‌  ఒక్క పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. 57 బంతుల్లో 99 పరుగులు రత్‌రాజ్‌ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. కాగా తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోవడంతో గైక్వాడ్‌ కాస్త నిరాశకు గురయ్యాడు. అయితే తమ జట్టు మ్యాచ్‌ గెలవడంతో తను సంతోషంగా ఉన్నట్లు మ్యా్‌చ్‌ అనంతరం గైక్వాడ్‌ తెలిపాడు. 

"99 పరుగుల వద్ద ఔట్‌ కావడం నాకు కొంచెం బాధ కలిగించింది. నా ఆటలో స్పీడ్‌ పెంచి.. డెవాన్ కాన్వేపై ఒత్తిడిని తగ్గించగలిగాను. 99 పరుగులు చేసినా, సెంచరీ సాధించినా మ్యాచ్‌ గెలవడం ముఖ్యం. అదే విధంగా హోమ్ గ్రౌండ్‌లో ఇటువంటి ఇన్నింగ్స్‌ ఆడంతం ఎంతో సంతోషంగా  ఉంది. నా ఫ్యామిలీ, స్నేహితులు నా ఆటను చూడటానికి ఇక్కడకు వచ్చారు. వాళ్లు గర్వపడేలా ఈ మ్యాచ్‌లో నేను ఆడాను. ముఖ్యంగా జట్టు విజయంలో నా వంతు పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉన్నాను" అని మ్యాచ్ అనంతరం ఫాస్ట్ బౌలర్ ముఖేష్ చౌదరితో ఇంటర్వ్యూలో గైక్వాడ్ చెప్పాడు.

చదవండి: IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌కు చుక్కలు చూపించాడు.. ఎవరీ మొహసిన్‌‌ ఖాన్..?

రుత్‌రాజ్‌ ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top