టీ20 ముంబై లీగ్ 2026 సీజన్‌లో అర్జున్ టెండూల్కర్ విజృంభించాడు. టోర్నీలో ఏఆర్‌సీఎస్ అంధేరీ తరఫున ఆడుతున్న అర్జున్ సోమవారం బాంద్రా బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిశాడు. మొదట బౌలింగ్‌లో మూడు వికెట్లు (3-1-11-3) కెరీర్ బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు.
ఆ తర్వాత బ్యాటింగ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన అర్జున్ టెండూల్కర్ 34 బంతుల్లోనే 66 పరుగులు అజేయ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌లో వన్‌మ్యాన్ షో ప్రదర్శన చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. 25 బంతుల్లోనే ఫిప్టీ మార్క్‌ను అందుకున్న అర్జున్ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.
అర్జున్ విధ్వంసంతో అంధేరీ 145 పరుగుల లక్ష్యాన్ని 13.5 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ముషీర్‌ఖాన్ (38 బంతుల్లో 58 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బాంద్రా బ్లాస్టర్స్ అర్జున్ టెండూల్కర్ ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులకే పరిమితమైంది.
ఓమ్ కేశ్‌కామత్ (36 బంతుల్లో 49) టాప్ స్కోరర్ కాగా, సాగర్ ఛాబ్రియా (23 బంతుల్లో 44) రాణించాడు. అర్జున్ మూడు వికెట్లు తీయగా, ప్రసూన్ సింగ్ 2, అజమ్ మిశ్రా, శివమ్ దూబే, ముషీర్ ఖాన్, ప్రగ్నేశ్‌లు తలా ఒక వికెట్ పడగొట్టారు.ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్‌జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆడింది ఒక్క మ్యాచ్ అయినప్పటికీ, తన ప్రదర్శనతో పర్వాలేదనిపించాడు. బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసిన అర్జున్ 36 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.
Match 16 | AA v BB: A performance to remember! Arjun Tendulkar bags the Player of the Match honours.
📌 June 1-13 | Wankhede Stadium.
🎟️ Tickets live at the link in bio.
🎥 Watch live on Jio Hotstar and Star Sports.
🌐 Track live on https://t.co/2GVUXSuuuk and the T20 Mumbai… pic.twitter.com/2C4JBSxKVw— T20 Mumbai (@T20Mumbai) June 8, 2026
Arjun Tendulkar hit such a massive six in today’s T20 Mumbai League match that the ball landed in the stands and struck a young child. The child appeared to be in a lot of pain and started crying loudly.😢 pic.twitter.com/yJIyGc3Oit
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) June 8, 2026


