రన్నరప్‌ రిత్విక్‌–అర్జున్‌ జోడీ | Runner ups Rithvik Arjun pair | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ రిత్విక్‌–అర్జున్‌ జోడీ

Mar 23 2026 12:55 AM | Updated on Mar 23 2026 12:55 AM

Runner ups Rithvik Arjun pair

న్యూఢిల్లీ: మొరెలాస్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–75 టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత డేవిస్‌కప్‌ జట్టు సభ్యుడు, హైదరాబాద్‌ ప్లేయర్‌ బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరీ రన్నరప్‌గా నిలిచాడు. మెక్సికోలో ఆదివారం జరిగిన ఫైనల్లో రిత్విక్‌–అర్జున్‌ ఖడే (భారత్‌) జోడీ 3–6, 6–7 (4/7)తో ఆండ్రెస్‌ అండ్రాడె (ఈక్వెడార్‌)–అగస్టిన్‌ గోమెజ్‌ (అర్జెంటీనా) జంట చేతిలో ఓడింది.  ఫైనల్లో ఓడిన రిత్విక్‌ జోడీకి 2.70 లక్షల నగదు (2,880 డాలర్లు)తో పాటు 50 పాయింట్లు లబించాయి. 

Advertisement
 
Advertisement
Advertisement