Rohit Sharma Takes Family On Holiday After WTC 2023 Final Loss, Goes Viral - Sakshi
Sakshi News home page

#RohitSharma: ట్రోల్స్‌ పట్టించుకోలేదు.. హాలిడే మూడ్‌లో రోహిత్‌ శర్మ

Jun 16 2023 9:06 AM | Updated on Jun 16 2023 10:55 AM

Rohit Sharma Takes Family On Holiday After WTC 2023 Final Loss Viral - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రస్తుతం హాలిడే మూడ్‌లో ఉన్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో 209 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా రెండోసారి రన్నరప్‌గా నిలిచింది. దీంతో రోహిత్‌ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి వేరే వాళ్లకు బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని అభిమానులు ట్రోల్స్‌, మీమ్స్‌తో రెచ్చిపోయారు.

అయితే వెస్టిండీస్‌తో జూలైలో జరగనున్న టెస్టు సిరీస్‌కు రోహిత్‌ కెప్టెన్‌గా ఉంటాడని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే విండీస్‌ టూర్‌లో అతను చేసే ప్రదర్శన ఆధారంగా రోహిత్‌ కెప్టెన్సీ భవితవ్యం తేలనుంది. కానీ రోహిత్‌ శర్మ మాత్రం​ అభిమానుల ట్రోల్స్‌, మీమ్స్‌ పట్టించుకోకుండా ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లిపోయాడు.

గత ఐదు నెలలుగా విరామం లేకుండా క్రికెట్‌ ఆడిన రోహిత్‌.. విండీస్‌తో సిరీస్‌ ప్రారంభమయ్యేలోపూ వెకేషన్‌ను బాగా ఎంజాయ్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా భార్య రితికా.. కూతురు సమైరాతో కలిసి దిగిన ఫోటోను రోహిత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. అయితే ఫోటో మాత్రమే షేర్‌ చేసిన రోహిత్‌ ఎలాంటి క్యాప్షన్‌ జత చేయలేదు.

ఇక రోహిత్‌ షేర్‌చేసిన ఫోటోపై శిఖర్‌ ధావన్‌ సహా రిషబ్‌ పంత్‌ స్పందించారు. ఎంజాయ్‌ మూడ్‌లో రోహిత్‌ భయ్యా అంటూ  కామెంట్‌ చేశారు. పంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ ఇషా నేగి, యజ్వేంద్ర చహల్‌.. అతని భార్య ధనశ్రీ వర్మ సహా మరికొందరు రోహిత్‌ షేర్‌ చేసిన ఫోటోకు లైకులు, హార్ట్‌ ఎమోజీలు పెట్టారు.

చదవండి: 'సంతోషంగా ఉంది.. బీసీసీఐ పరిస్థితి అర్థమైంది'

Advertisement
 
Advertisement
Advertisement