ఏయ్.. ఏమి చేస్తున్నావు! సీరియ‌స్ అయిన రోహిత్ శ‌ర్మ‌(వీడియో) | Rohit Sharma Shows Golden Heart: Scolds Security, Lets Young Fan Take Selfie at Shivaji Park | Sakshi
Sakshi News home page

ఏయ్.. ఏమి చేస్తున్నావు! సీరియ‌స్ అయిన రోహిత్ శ‌ర్మ‌(వీడియో)

Oct 12 2025 8:52 AM | Updated on Oct 12 2025 11:41 AM

Rohit Sharma Makes Frustration Clear, Scolds Security Trying To Stop Young Fan

టీమిండియా స్టార్ ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్‌కు సిద్ద‌మ‌వుతున్నాడు. 38 ఏళ్ల రోహిత్ ప్ర‌స్తుతం ముంబైలోని ప్రఖ్యాత శివాజీ పార్క్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అత‌డు భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో స‌న్న‌ద్ద‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

హిట్‌మ్యాన్ శివాజీ పార్క్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడ‌న్న విష‌యం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్య‌లో అక్క‌డికి త‌ర‌లివ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఓ అనుహ్య సంఘ‌ట‌న చోటు చేసుకుంది. శివాజీ పార్క్ వ‌చ్చిన  ఓ చిన్నారి అభిమాని రోహిత్‌ను కలిసేందుకు ప్ర‌య‌త్నించాడు.

రోహిత్ వ‌ద్ద‌కు వెళ్లే క్ర‌మంలో ఆ యంగ్ ఫ్యాన్‌తో సెక్యూరిటీ సిబ్బంది కాస్త దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. ఈ విషయాన్ని గమనించిన రోహిత్ సెక్యూరిటీపై సీరియ‌స్ అయ్యాడు. వారిపై గ‌ట్టి అరుస్తూ అత‌న్ని త‌న‌వ‌ద్దకు పంపించాల‌ని సూచించాడు. దీంతో హిట్‌మ్యాన్ వ‌ద్ద‌కు వెళ్లిన ఆ యువ అభిమాని సెల్పీ తీసుకుని ఖుషీ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. 

ఇది చూసిన నెటిజ‌న్లు రోహిత్ శ‌ర్మ మ‌న‌సు బంగారం అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇటీవ‌లే భార‌త వ‌న్డే జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌లు నుంచి రోహిత్‌ను త‌ప్పించిన సంగ‌తి తెలిసిందే. అత‌డి స్ధానంలో యువ ఆట‌గాడు శుభ్‌మ‌న్ గిల్‌ను వ‌న్డే సార‌థిగా, అత‌డికి డిప్యూటీగా శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను సెల‌క్ట‌ర్లు నియ‌మించారు.

గత మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరిగిన తర్వాత భార‌త్ త‌ర‌పున రోహిత్‌కు ఇదే తొలిమ్యాచ్‌. ఆసీస్ టూర్ కోసం రోహిత్ తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు. ఈ మాజీ కెప్టెన్ గ‌తంతో పోలిస్తే చాలా ఫిట్‌గా క‌న్పిస్తున్నాడు.
చదవండి: టీమిండియాపై ఓవ‌రాక్ష‌న్‌.. క‌ట్ చేస్తే! ఊహించని షాకిచ్చిన ఐసీసీ

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement