'భారత క్రికెట్ చరిత్రలో ఇదే మొదటి సారి'.. రోహిత్‌పై ఎమ్ఎస్కే ఫైర్‌ | Rohit Sharma destroyed by former BCCI selector MSK Prasad | Sakshi
Sakshi News home page

'భారత క్రికెట్ చరిత్రలో ఇదే మొదటి సారి'.. రోహిత్‌పై ఎమ్ఎస్కే ఫైర్‌

Dec 28 2024 7:19 PM | Updated on Dec 28 2024 8:20 PM

Rohit Sharma destroyed by former BCCI selector MSK Prasad

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ గ‌డ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో తొలి టెస్టుకు దూరమైన రోహిత్‌.. ఆ త‌ర్వాత త‌ను ఆడిన రెండు మ్యాచ్‌ల‌లోనూ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. ఇప్పుడు మెల్‌బోర్న్ వేదిక‌గా ఆసీస్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్టులోనూ అదే తీరును క‌న‌బ‌రిచాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 3 ప‌రుగులు మాత్ర‌మే చేసి హిట్‌మ్యాన్ పెవిలియ‌న్‌కు చేరాడు. ఈ నేప‌థ్యంలో రోహిత్ శ‌ర్మ‌పై బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్ విమర్శలు గుప్పించారు. కెప్టెన్సీ, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ శ‌ర్మ విఫ‌ల‌మయ్యాడ‌ని ఎమ్ఎస్కే మండిప‌డ్డారు.

టెస్టుల్లో రోహిత్ శ‌ర్మ త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోతున్నాడు. బ్యాటింగ్‌, కెప్టెన్సీ రెండింటిలోనూ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. బీజీటీకి ముందు న్యూజిలాండ్ చేతిలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ ఓట‌మి చ‌విచూసింది. ఇది నిజంగా భార‌త్ క్రికెట్‌కు అవ‌మాన‌కరం.  స్వ‌దేశంలో మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురవ్వ‌డం భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.

ఈ సిరీస్‌లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ అటూ జ‌ట్టును న‌డిపించ‌డంలోనూ , ఇటు బ్యాటింగ్‌లోనూ విఫ‌ల‌మ‌య్యాడు. ఆ త‌ర్వాత ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌నకు రోహిత్‌ వ‌చ్చాడు. తొలి టెస్టుకు వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో దూరం కావ‌డంతో జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను బుమ్రా తీసుకున్నాడు.

తొలి టెస్టులో జ‌ట్టును బుమ్రా అద్బుతంగా న‌డిపించాడు. ఆ త‌ర్వాత అందుబాటులోకి వ‌చ్చిన రోహిత్ బుమ్రా తిరిగి జ‌ట్టును ప‌గ్గాల‌ను అందుకున్నాడు. రోహిత్ వ‌రుస వైఫల్యాలతోనే ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై అడుగుపెట్టాడు. త‌న పేల‌వ ఫామ్‌ను ఇక్క‌డ కూడా కొన‌సాగిస్తున్నాడు. కెప్టెన్సీలోనూ ప్రోయాక్టివ్‌(చుర‌గ్గా)గా ఉండడం లేదు. మెల్‌బోర్న్ టెస్టులో రోహిత్ కెప్టెన్సీ లోపం స్ప‌ష్టంగా క‌న్పించింది.

సామ్ కాంటాస్ ఫాస్ట్ బౌల‌ర్ల‌ను అద్బుతంగా ఆడుతున్న‌ప్ప‌టికి మ‌హ్మ‌ద్ సిరాజ్‌, జస్ప్రీత్ బుమ్రాతో వ‌రుస‌గా 11 ఓవర్లు బౌలింగ్ చేయించాడు. ఆ స‌మ‌యంలో స్పిన్న‌ర్‌న తీసుకు వ‌చ్చివుంటే ఆరంభంలోనే అత‌డి వికెట్ ద‌క్కేది. రోహిత్ వ్యూహ‌త్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. అతడు కెప్టెన్సీతో పాటు ఫామ్‌ లేమితో సతమతవుతున్నాడని" ఎమ్ఎస్కే ప్రసాద్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement