రిత్విక్‌–నిక్కీ పునాచా జోడీ ముందంజ   | Rithvik and Nicky Punacha pair is the lead | Sakshi
Sakshi News home page

రిత్విక్‌–నిక్కీ పునాచా జోడీ ముందంజ  

Feb 9 2024 4:04 AM | Updated on Feb 9 2024 4:04 AM

Rithvik and Nicky Punacha pair is the lead - Sakshi

చెన్నై ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–100 టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ ప్లేయర్‌ బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరీ–నిక్కీ పునాచా (భారత్‌) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో రిత్విక్‌–నిక్కీ జంట 5–7, 6–1, 10–7తో పరీక్షిత్‌ సొమాని–మనీశ్‌ సురేశ్‌ కుమార్‌ (భారత్‌) ద్వయంపై విజయం సాధించింది.

భారత డేవిస్‌కప్‌ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని–రామ్‌కుమార్‌ రామనాథన్‌ (భారత్‌) జోడీ కూడా సెమీఫైనల్‌ చేరింది. క్వార్టర్‌ ఫైనల్లో సాకేత్‌–రామ్‌కుమార్‌ ద్వయం 4–6, 6–4, 10–6తో డాన్‌ యాడెడ్‌–ఉగో బ్లాంచెట్‌ (ఫ్రాన్స్‌) జోడీపై గెలుపొందింది.  నేడు జరిగే సెమీఫైనల్స్‌లో తొషిహిదె మత్సుయ్‌–కైటో యుసుగి (జపాన్‌)లతో సాకేత్‌–రామ్‌కుమార్‌; జేకబ్‌–మార్క్‌ వాల్నెర్‌ (జర్మనీ)లతో రిత్విక్‌–నిక్కీ తలపడతారు.  

Advertisement
 
Advertisement
Advertisement