వారెవ్వా పంత్‌.. ఆ షాట్ ఎలా కొట్టావు భయ్యా! వీడియో వైర‌ల్‌ | Rishabh Pant Stuns Cummins With A Jaw-Dropping Six In Perth Test | Sakshi
Sakshi News home page

IND vs AUS: వారెవ్వా పంత్‌.. ఆ షాట్ ఎలా కొట్టావు భయ్యా! వీడియో వైర‌ల్‌

Nov 22 2024 4:13 PM | Updated on Nov 22 2024 5:58 PM

Rishabh Pant Stuns Cummins With A Jaw-Dropping Six In Perth Test

టెస్టు క్రికెట్‌లో టీమిండియా స్టార్ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ల‌పై అద‌ర‌గొట్టిన పంత్‌.. ఇప్పుడు ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై కూడా అదే దూకుడును క‌న‌బ‌రిచాడు. పెర్త్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మొద‌టి టెస్టులో రిష‌బ్ పంత్ కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. 

ఓ వైపు క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు ప‌డ‌తున్న‌ప్ప‌టికీ ఈ ఢిల్లీ చిచ్చ‌ర‌పిడుగు మాత్రం ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్లను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొన్నాడు. నితీష్ కుమార్ రెడ్డితో క‌లిసి స్కోర్ బోర్డును ముందుకు న‌డిపించాడు. ఓవ‌రాల్‌గా 78 బంతులు ఎదుర్కొన్న పంత్‌.. 3 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 37 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు.

పంత్ స్ట‌న్నింగ్ షాట్‌..
కాగా రిష‌బ్ త‌న ఇన్నింగ్స్‌లో సంచ‌ల‌న షాట్‌తో మెరిశాడు. అత‌డు కొట్టిన షాట్ మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలుస్తుంది అన‌డంలో ఎటువంటి సందేహం లేదు. భార‌త ఇన్నింగ్స్ 41 ఓవ‌ర్ వేసిన పాట్ క‌మ్మిన్స్.. చివ‌రి బంతిని రౌండ్ ది వికెట్ నుండి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశ‌గా సంధించాడు. వెంటనే పంత్ త‌న బ్యాటింగ్ పొజిషన్ మార్చుకుని ఎడమవైపునకు వచ్చి డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా స్కూప్ షాట్ ఆడాడు.

అయితే ఈ షాట్ ఆడే క్ర‌మంలో పంత్ బ్యాలెన్స్ కోల్పోయి కింద‌ప‌డిపోయాడు. అయిన‌ప్ప‌ట‌కి అత‌డి ప‌వ‌ర్‌కు బంతి బౌండ‌రీ లైన్ అవ‌త‌ల ప‌డింది. పంత్ షాట్ చూసి ప్ర‌త్య‌ర్ధి ఆట‌గాళ్లు సైతం ఫిదా అయిపోయారు.

కామెంటేర్‌లు కూడా రిష‌బ్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా ఎక్స్‌లో షేర్ చేసింది. రిష‌బ్ పంత్ ఒక్క‌డే ఈ షాట్ ఆడ‌గల‌డు అంటూ క్యాప్ష‌న్‌గా ఇచ్చింది.

150@ భారత్‌..
ఇక మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 150 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో నితీష్‌ కుమార్‌ రెడ్డి(41) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్‌ బౌలర్లలో హాజిల్ వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్‌, కమ్మిన్స్‌, మిచెల్ మార్ష్ తలా రెండు వికెట్లు సాధించారు.

 అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన ఆసీస్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి కేవలం 67 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో అలెక్స్‌ క్యారీ(19), మిచెల్‌ స్టార్క్‌(6) పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌ రెండు, హర్షిత్‌ ఒక్క వికెట్‌ సాధించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement