ఐపీఎల్ 2026 సీజన్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ వైదొలగనున్నాడా? అంటే అవునానే అంటున్నారు భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్. ఈ ధనధాన్ లీగ్‌లో భాగంగా బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంత్ గాయపడ్డాడు. ఆర్సీబీ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఓ బంతి పంత్ మోచేతికి బలంగా తాకింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడాడు.
వెంటనే ఫిజియో వచ్చి మ్యాజిక్ స్ప్రే చేసినప్పటికి అతడికి నొప్పి తగ్గలేదు. ఆ తర్వాత బ్యాటింగ్ కొనసాగించలేక మైదానాన్ని వీడాడు. మళ్లీ ఆఖరిలో పంత్ బ్యాటింగ్‌కు వచ్చినప్పటికి ఆసౌకర్యంగా కన్పించాడు. అతడు మొత్తంగా ఆరు బంతుల్లో ఒక్క మాత్రమే చేసి పెవిలియన్ చేరిపోయాడు. ఆ తర్వాత అతడు ఫీల్డింగ్ రాలేదు. పంత్ స్దానంలో నికోలస్ పూరన్ స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో పంత్ గాయంపై కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఐపీఎల్-2026 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు రిషబ్ పంత్ అందుబాటులో ఉండేలా కనిపించడం లేదు. ప్రస్తుతం లక్నో జట్టు చాలా బలహీనంగా ఉంది. ముఖ్యంగా వారి బ్యాటింగ్ విభాగం చాలా దారుణంగా ఉంది. కేవలం బౌలింగ్ మాత్రమే బాగుంది. ఈ సీజన్‌లో లక్నో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రత్యర్ధి ముందు 200 పరుగుల లక్ష్యాన్ని ఉంచలేకపోయింది.
మార్‌క్రమ్ ఒక చెత్త క్రికెటర్. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్‌ను బెంచ్‌కే పరిమితం చేయాలి. ఈ ముగ్గురు భారీ స్కోర్‌లు సాధిస్తారని వేచి చూడడం ముందు ఆపండి. వారి స్ధానంలో కొత్త ఆటగాళ్లకు అవకాశమివ్వండి. ఏదేమైనప్పటికి వారి బ్యాటింగ్ చూస్తుంటే ఈ ఏడాది ప్లే ఆఫ్స్ చేరే అవకాశం అస్సలు కనిపించడం లేదు శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు. ఈ ఏడాది సీజన్‌లో లక్నో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడి రెండింట గెలుపొందింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో లక్నో ఏడో స్ధానంలో కొనసాగుతోంది.
చదవండి: వైభవ్ సూర్యవంశీకి సంబంధించి బిగ్ న్యూస్!


