SMAT 2023: రింకూ సింగ్‌ విధ్వంసం.. 33 బంతుల్లో 6 సిక్సర్ల సాయంతో..!

Rinku Singh Show In Quarterfinals Of Syed Mushtaq Ali Trophy 2023 - Sakshi

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2023లో టీమిండియా యువ చిచ్చరపిడుగు రింకూ సింగ్‌ విధ్వంసం సృష్టించాడు. పంజాబ్‌తో ఇవాళ (నవంబర్‌ 2) జరుగుతున్న క్వార్టర్‌ఫైనల్‌-1లో రింకూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లో4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 77 పరుగులు చేశాడు. రింకూ విధ్వంసం ధాటికి పంజాబ్‌ ఆఖరి రెండు ఓవర్లలో 39 పరుగులు సమర్పించుకుంది.

ఆఖరి ఓవర్లో రింకూ టీమిండియా సహచరుడు అర్షదీప్‌ సింగ్‌ను టార్గెట్‌ చేశాడు. ఈ ఓవర్లో రింకూ 3 సిక్సర్ల సాయంతో 23 పరుగులు పిండుకున్నాడు. రింకూ విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఉత్తర్‌ప్రదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. రింకూతో పాటు సమీర్‌ రిజ్వి (29 బంతుల్లో 42 నాటౌట్‌; ఫోర్‌, 4 సిక్సర్లు) రాణించాడు.

యూపీ ఇన్నింగ్స్‌లో గోస్వామి (16), కరణ్‌ శర్మ (14), నితీశ్‌ రాణా (17) తక్కువ స్కోర్లకే ఔటైనా సమీర్‌ అండతో రింకూ చెలరేగిపోయాడు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో సిద్దార్థ్‌ కౌల్‌, హర్ప్రీత్‌ బ్రార్‌ తలో వికెట్‌ పడగొట్టగా.. నితీశ్‌ రాణా రనౌటయ్యాడు. 

అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌ 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (42 నాటౌట్‌), నేహల్‌ వధేరా (21 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ శర్మ (12), ప్రభసిమ్రన్‌ సింగ్‌ (0), మన్‌దీప్‌ సింగ్‌ (1) నిరాశపరచగా.. అన్మోల్‌ప్రీత్‌, నేహల్‌ జట్టును గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. యూపీ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ పొదుపుగా (2 ఓవర్లలో 3 పరుగులు) బౌలింగ్‌ చేయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టాడు. మోహిసిన్‌ ఖాన్‌కు మరో వికెట్‌ దక్కింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

10-11-2023
Nov 10, 2023, 21:53 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో ఇప్పటికే సెమీస్‌కు చేరిన దక్షిణాఫ్రికా.. మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా...
10-11-2023
Nov 10, 2023, 20:51 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో శ్రీలంక ఆటగాడు ఏంజులో మాథ్యూస్‌ టైమ్డ్‌ ఔట్‌తో చరిత్రకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో భాగంగా...
10-11-2023
Nov 10, 2023, 20:17 IST
దక్షిణాఫ్రికా స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలో ఒక మ్యాచ్‌లో...
10-11-2023
Nov 10, 2023, 19:15 IST
Angelo Mathews Timed Out Row: ‘టైమ్డ్‌ అవుట్‌’ విషయంలో శ్రీలంక ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌ను ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ...
10-11-2023
Nov 10, 2023, 19:08 IST
న్యూజిలాండ్‌ యువ సంచలనం రచిన్ రవీంద్ర.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అరంగేట్ర వరల్డ్‌కప్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ రికార్డులకు...
10-11-2023
Nov 10, 2023, 18:16 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో అహ్మదాబాద్‌ వేదికగా దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్‌ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన...
10-11-2023
Nov 10, 2023, 17:10 IST
Rohit Sharma- ViratKohli- Team India Captaincy: వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా అద్భుత విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో...
10-11-2023
Nov 10, 2023, 16:53 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా పేస్‌ త్రయం జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమీ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ​తొలి...
10-11-2023
Nov 10, 2023, 16:00 IST
అఫ్గనిస్తాన్‌ స్టార్‌ ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌కప్‌  ఎడిషన్‌లో 23 ఏళ్ల వయస్సులోపు అత్యధిక...
10-11-2023
Nov 10, 2023, 15:42 IST
ICC WC 2023: వన్డే వరల్డ్‌కప్‌-2023 సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటిన న్యూజిలాండ్‌ పాకిస్తాన్‌ అవకాశాలను...
10-11-2023
Nov 10, 2023, 13:42 IST
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (నవంబర్‌ 10) ఆఫ్ఘనిస్తాన్‌, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌...
10-11-2023
Nov 10, 2023, 13:39 IST
ICC WC 2023- NZ vs SL: వన్డే వరల్డ్‌కప్‌-2023లో మాజీ చాంపియన్‌ శ్రీలంక ఘోర పరాభవం మూటగట్టుకుంది. న్యూజిలాండ్‌...
10-11-2023
Nov 10, 2023, 12:50 IST
2023 అక్టోబర్‌ నెల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును న్యూజిలాండ్‌ రైజింగ్‌ స్టార్‌ రచిన్‌ రవీంద్ర దక్కించుకున్నాడు....
10-11-2023
Nov 10, 2023, 11:59 IST
భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ రైజింగ్‌ క్రికెట్‌ స్టార్‌ రచిన్ రవీంద్రకు వింత అనుభవం ఎదురైంది. శ్రీలంకతో మ్యాచ్‌ ముగిసిన...
10-11-2023
Nov 10, 2023, 10:11 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, సెమీస్‌ బెర్త్‌ను దాదాపుగా ఖరారు...
10-11-2023
Nov 10, 2023, 09:15 IST
ప్రస్తుత ప్రపంచకప్‌లో పాక్‌ సెమీస్‌కు చేరడం దాదాపుగా అసాధ్యమనే చెప్పవచ్చు. ఏదో అత్యద్భుతం జరిగితే తప్ప, దాయాది జట్టు ఫైనల్‌ ఫోర్‌కు...
10-11-2023
Nov 10, 2023, 08:10 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ఇవాళ (నవంబర్‌ 10) ఆఫ్ఘనిస్తాన్‌, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది....
10-11-2023
Nov 10, 2023, 07:27 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో సెమీస్‌ బెర్త్‌లు దాదాపుగా ఖరారైపోయాయి. భారత్‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌ సెమీస్‌కు చేరడం​ దాదాపుగా...
09-11-2023
Nov 09, 2023, 21:14 IST
జీవనసహచరులు.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పరస్పర సమన్వయంతో కలిసి నడిస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ...
09-11-2023
Nov 09, 2023, 21:00 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో పాకిస్తాన్‌ సెమీస్‌ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. ఈ మెగా టోర్నీలో భాగంగా శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top