ఇటువంటి అద్భుతాలు సర్‌ జడేజా ఒక్కడికే సాధ్యం.. చాలా సంతోషంగా ఉంది: రైనా

Ravindra Jadeja did something only Sir Jadeja could do: Suresh Raina - Sakshi

ఐపీఎల్‌-2023 విజేతగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన తుదిపోరులో 5 వికెట్ల తేడాతో(డక్‌వర్త్‌లూయిస్‌ పద్దతిలో) విజయం సాధించిన సీఎస్‌కే.. ఐదో సారి ఛాంపియన్స్‌గా నిలిచింది. ఇక ఆఖరి బంతికి ఫోర్‌ కొట్టి సీఎస్‌కేను ఛాంపియన్స్‌గా నిలిసిన రవీంద్ర జడేజాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ ఆటగాడు సురేష్‌ రైనా చేరాడు. జడ్డూను పొగడ్తలతో రైనా ముంచెత్తాడు. అసాధ్యాలను సుసాధ్యం చేసే సత్తా సర్‌ జడేజాకు ఒక్కడికే ఉందని రైనా కొనియాడు. కాగా సీఎస్‌కే విజయానికి ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్‌ వేసిన మొహిత్‌ శర్మ తొలి నాలుగు బంతులకే కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆఖరి రెండు బంతులకు 10 పరుగులు అవసరమవ్వగా.. జడ్డూ వరుసగా సిక్స్‌, ఫోర్‌ బాది గుజరాత్‌ ఆశలపై నీళ్లు చల్లాడు.

ఈ నేపథ్యంలో జియో సినిమాతో రైనా మాట్లాడుతూ.. "రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ కొట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. మొహిత్‌ తొలి నాలుగు బంతులను అద్బుతంగా వేశాడు. అటువంటి బౌలర్‌కు జడ్డూ వరుసగా సిక్స్‌, ఫోర్‌ బాది తన జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు.

తీవ్రమైన ఒత్తిడిలో కూడా జడ్డూ తన మాస్టర్‌క్లాస్‌ను ప్రదర్శించాడు. అందుకే ఎంఎస్ ధోని కూడా జడేజాను ఎత్తుకుని సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఇటువంటి అద్భుతాలు సర్‌జడేజాకు ఒక్కడే సాధ్యం. ఇది చారిత్రాత్మక విజయం. ఈ క్షణాన్ని దేశం మొత్తం గర్వించింది. మొత్తం పసుపు రంగుగా మారిపోయింది" అని పేర్కొన్నాడు.
చదవండిIPL 2023: అదరగొట్టిన గిల్‌.. ఎన్ని అవార్డులు వచ్చాయంటే? మొత్తం ప్రైజ్‌మనీ ఎంతంటే?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top