ఢిల్లీ జ‌ట్టులోకి సౌతాఫ్రికా విధ్వంస‌క‌ర ఆట‌గాడు..ఎవరంటే? | Rassie van der Dussen Likely Replace Mitchell Marsh in DC squad for IPL 2024 | Sakshi
Sakshi News home page

IPL 2024: ఢిల్లీ జ‌ట్టులోకి సౌతాఫ్రికా విధ్వంస‌క‌ర ఆట‌గాడు..ఎవరంటే?

Apr 23 2024 6:11 PM | Updated on Apr 23 2024 6:17 PM

Rassie van der Dussen Likely Replace Mitchell Marsh in DC squad for IPL 2024 - Sakshi

ఐపీఎల్‌-2024లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు మిచిల్ మార్ష్ రూపంలో భారీ ఎదురుదెబ్బ త‌గిలిన సంగ‌తి తెలిసిందే. తొడ‌కండరాల గాయం కార‌ణంగా మార్ష్ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. ఈ విష‌యాన్ని ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ సైతం ధ్రువీక‌రించాడు. ఈ క్ర‌మంలో మార్ష్ స్ధానాన్ని భర్తీ చేసే ప‌నిలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ మెనెజ్‌మెంట్ ప‌డింది.

మార్ష్ ప్లేస్‌లో ద‌క్షిణాఫ్రికా మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ ర‌స్సీ వాండ‌ర్ డ‌స్సెన్ పేరును ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. కాగా ఐపీఎల్‌-2024 మినీ ఆక్షన్‌లో రూ.2 కోట్ల కనీస ధరతో వేలంకు వచ్చిన వాండ‌ర్ డ‌స్సెన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌ సీజ‌న్ ప్రారంభానికి ముందు జ‌రిగిన  పాకిస్తాన్‌ సూపర్ లీగ్‌లో ఈ ప్రోటీస్‌ స్టార్ ద‌మ్ములేపాడు.

 ఈ లీగ్‌లో కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన డస్సెన్‌.. 364 పరుగులతో సెకెండ్‌ లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. అదే విధంగా దక్షిణాఫ్రికా టీ20లో కూడా డస్సెన్‌ అదరగొట్టాడు. ఈ క్రమంలోనే డస్సెన్‌ను ఢిల్లీ సొంతం చేసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు  పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. వాన్ డెర్ డస్సెన్‌ గతంలో ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement