క్వార్టర్స్‌లో రామ్‌కుమార్‌ రామనాథన్‌ | Ramkumar Ramanathan in quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో రామ్‌కుమార్‌ రామనాథన్‌

Feb 15 2024 3:48 AM | Updated on Feb 15 2024 3:48 AM

Ramkumar Ramanathan in quarters - Sakshi

భారత డేవిస్‌కప్‌ ప్లేయర్‌ రామ్‌కుమార్‌ రామనాథన్‌ అగ్రశ్రేణి ఆటతీరుతో టాప్‌సీడ్‌ ఆటగాడికి షాకిచ్చాడు. బెంగళూరు ఓపెన్‌ ఏటీపీ–100 చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీతో బరిలోకి దిగిన రామ్‌కుమార్‌ అద్భుతమైన విజయంతో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో భారత ప్లేయర్‌ 1–6, 6–4, 6–4తో టాప్‌ సీడ్‌ ల్యుకా నర్డి (ఇటలీ)ని ఓడించాడు.

 తొలి సెట్‌లో నర్డి ధాటికి రామ్‌కుమార్‌ తేలిపోయాడు. సెట్‌ ఆరంభంలోనే అతని సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఇటలీ స్టార్‌ ప్లేయర్‌ అలవోకగా తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే తర్వాతి సెట్లలో భారత ఆటగాడు దూకుడు కనబరిచాడు.

రెండో సెట్‌లో 3–2తో ఆధిక్యంలో ఉన్న దశలో కీలకమైన బ్రేక్‌ పాయింట్‌ సాధించిన రామ్‌కుమార్‌ అదే జోరుతో సెట్‌ గెలిచి 1–1తో సమం చేశాడు. మూడో సెట్‌లో రామ్‌ సంధించిన ఏస్‌లకు టాప్‌సీడ్‌ ఆటగాడు బదులివ్వలేకపోయాడు. ప్రత్యర్థి సర్విస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేసిన భారత ఆటగాడు ఈ సెట్‌లోనూ దూకుడు పెంచి మ్యాచ్‌ గెలిచాడు. నర్డి 4 ఏస్‌లు సంధిస్తే... రామ్‌కుమార్‌ 9 ఏస్‌లు సంధించాడు.   

Advertisement
 
Advertisement
Advertisement