ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత బృందానికి రాష్ట్రపతి తేనీటి విందు | Ram Nath Kovind Host Tea For Indian Athletes Tokyo Olympics Rashtrapati Bhavan | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత బృందానికి రాష్ట్రపతి తేనీటి విందు

Aug 14 2021 6:28 PM | Updated on Aug 14 2021 6:33 PM

Ram Nath Kovind Host Tea For Indian Athletes Tokyo Olympics Rashtrapati Bhavan - Sakshi

ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత బృందానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి భవన్‌లో తేనేటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఒలింపిక్స్‌లో మీరు సాధించిన పతకాలతో 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న దేశ గౌరవాన్ని మరింత పెంచారని రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. 

అనంతరం వారితో ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ అత్యధికంగా ఏడు పతకాలు సాధించగా.. ఇందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు ఉన్నాయి. 


 

Advertisement
 
Advertisement
Advertisement