వెర్‌స్టాపెన్‌కు పోల్‌ ­ | Sakshi
Sakshi News home page

వెర్‌స్టాపెన్‌కు పోల్‌ ­

Published Sun, Apr 7 2024 2:48 AM

Poll for Verstappen - Sakshi

సుజుకా: ఫార్ములా వన్‌ సీజన్‌ జపాన్‌ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ కొత్త ఉత్సాహంతో మొదలు పెట్టనున్నాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన గత రేసులో కారు బ్రేకులు వైఫల్యంతో రేసు మధ్యనుంచి తప్పుకున్న వెర్‌స్టాపెన్‌... శనివారం జరిగిన జపాన్‌ గ్రాండ్‌ ప్రి క్వాలిఫయింగ్‌లో మొదటి స్థానంలో నిలిచాడు.

క్వాలిఫయింగ్‌ రేసును వెర్‌స్టాపెన్‌ 1 నిమిషం 28.197 సెకన్లలో పూర్తి చేశాడు. రెడ్‌బుల్‌కే చెందిన సెర్గెయో పెరెజ్‌ (1 నిమిషం 28. 263 సెకన్లు)కు రెండో స్థానం దక్కగా...ల్యాండో నోరిస్‌ (మెక్లారెన్‌ – 1 నిమిషం 28.489 సె.) మూడో స్థానంలో నిలిచాడు.   

Advertisement
 
Advertisement
 
Advertisement