ప్యాట్‌ కమ్మిన్స్‌ అరుదైన ఘనత.. కపిల్‌ దేవ్‌ సరసన | AUS Vs NZ 1st Test: Pat Cummins Becomes 2nd Australia Captain To Reach Wicket-Taking Milestone, See Details Inside - Sakshi
Sakshi News home page

AUS Vs NZ 1st Test: ప్యాట్‌ కమ్మిన్స్‌ అరుదైన ఘనత.. కపిల్‌ దేవ్‌ సరసన

Published Fri, Mar 1 2024 9:18 PM

Pat Cummins becomes 2nd Australia captain to reach wicket-taking milestone - Sakshi

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 100 వికెట్లు పడగొట్టిన రెండో ఆసీస్‌ కెప్టెన్‌గా కమ్మిన్స్‌ రికార్డులకెక్కాడు. వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలా​ండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో డారిల్ మిచెల్‌ను ఔట్ చేసిన‌ క‌మిన్స్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు.

ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన పదో కెప్టెన్‌గా కమ్మిన్స్‌ నిలిచాడు. సారథిగా వందకు పైగా వికెట్లు తీసిన ఆట‌గాళ్ల‌ జాబితాలో పాక్ మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్ ఖాన్ అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇమ్రాన్‌ ఖాన్‌ 71 ఇన్నింగ్స్‌లలో 187 వికెట్లు పడగొట్టారు. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్‌ క‌పిల్ దేవ్(111) సైతం ఉన్నారు.

ఈ ఘనత సాధించిన కెప్టెన్‌లు వీరే

ఇమ్రాన్ ఖాన్ (పాక్‌): 187 వికెట్లు

రిచీ బెనాడ్ (ఆసీస్‌): 138 వికెట్లు

గార్ఫీల్డ్ సోబర్స్ (వెస్టిండీస్‌): 117 వికెట్లు

డేనియల్ వెట్టోరి (న్యూజిలాండ్‌): 116 వికెట్లు

కపిల్ దేవ్ (భారత్‌): 111 వికెట్లు

వసీం అక్రమ్ (పాక్‌): 107 వికెట్లు

బిషన్ సింగ్ బేడీ (భారత్‌): 106 వికెట్లు

షాన్ పొలాక్ (దక్షిణాఫ్రికా): 103 వికెట్లు

జాసన్ హోల్డర్ (వెస్టిండీస్‌): 100 వికెట్లు

పాట్ కమిన్స్ (ఆసీస్‌): 100 వికెట్లు

Advertisement
 
Advertisement