కమ్మిన్స్‌పై కాసుల వర్షం.. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర? ఎన్ని కోట్లంటే? | IPL 2024 Mini Auction: Pat Cummins Became The Most Costliest Player In IPL History Ever At 20 Crore - Sakshi
Sakshi News home page

IPL 2024 Auction-Pat Cummins: కమ్మిన్స్‌పై కాసుల వర్షం.. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర? ఎన్ని కోట్లంటే?

Dec 19 2023 2:24 PM | Updated on Dec 19 2023 3:32 PM

Pat Cummins Become Costliest IPL Player Ever At 20 Crore - Sakshi

ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ సరి కొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా కమ్మిన్స్‌ నిలిచాడు. ఐపీఎల్‌-2024 వేలంలో కమ్మిన్స్‌ను రూ.20.50 కోట్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొనుగోలు చేసింది.  రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అతడి కోసం ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌ తీవ్రంగా పోటీ పడ్డాయి.

చివరికి ఆర్సీబీ పోటీ నుంచి తప్పుకోవడంతో భారీ ధరకు ఎస్‌ఆర్‌హెచ్‌ సొంతం చేసుకుంది. ప్యాట్‌ కమ్మిన్స్‌కు బాల్‌తోనూ బ్యాట్‌తోనూ రాణించే సత్తా ఉంది. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ తన నాయకత్వంలో ఆస్ట్రేలియాకు ఆరో ప్రపంచకప్‌ను అందించాడు. అదే విధంగా ఐపీఎల్‌-2022 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

ఐపీఎల్‌-2023 సీజన్‌కు వ్యక్తిగత కారణాలతో కమ్మిన్స్‌ దూరమయ్యాడు. అయితే ఈసారి ఐపీఎల్‌లో ఆడాలని కమ్మిన్స్‌ నిర్ణయించుకున్నాడు. దీంతో ఐపీఎల్‌-2024 వేలంలో తన పేరును రిజిస్టర్‌ చేసుకున్నాడు. వేలంలోకి వచ్చిన అతడిపై ఎస్‌ఆర్‌హెచ్‌ కాసుల వర్షం కురిపించింది. ఈ క్రమంలో ఐపీఎల్‌ వేలంలో అత్యధిక అమ్ముడుపోయిన శామ్ కుర్రాన్‌ రికార్డును  కమిన్స్ బద్దలుకొట్టాడు. సామ్ కుర్రన్.. ఐపీఎల్ 2023 వేలంలో రూ.18.25 కోట్లకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement