భారత రెజ్లింగ్‌ ట్రయల్స్‌ 25, 26వ తేదీల్లో | Paris Olympics: Trials for World Championships on August 25-26 in Patiala | Sakshi
Sakshi News home page

భారత రెజ్లింగ్‌ ట్రయల్స్‌ 25, 26వ తేదీల్లో

Aug 15 2023 6:18 AM | Updated on Aug 15 2023 6:18 AM

Paris Olympics: Trials for World Championships on August 25-26 in Patiala - Sakshi

న్యూఢిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌లను ఖరారు చేసే ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌íÙప్‌లో పాల్గొనే భారత జట్లను ఈనెల 25, 26వ తేదీల్లో ఎంపిక చేయనున్నారు. పాటియాలాలో నిర్వహించే ఈ ట్రయల్స్‌ నుంచి ఎవరికీ మినహాయింపు లేదని... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలనుకుంటే అందరూ ఈ ట్రయల్స్‌కు హాజరు కావాల్సిందేనని భారత రెజ్లింగ్‌ సమాఖ్య వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అడ్‌–హక్‌ ప్యానెల్‌ వెల్లడించింది.

ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్ల ఎంపిక కోసం నిర్వహించిన ట్రయల్స్‌ నుంచి స్టార్‌ రెజ్లర్లు బజరంగ్‌ పూనియా, వినేశ్‌ ఫొగాట్‌లకు మినహాయింపు ఇవ్వడం వివాదాస్పదమైంది.  సెపె్టంబర్‌ 16 నుంచి 24 వరకు బెల్‌గ్రేడ్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ జరగనుంది. ప్రపంచ చాంపియన్‌íÙప్‌లో ఆయా కేటగిరీల్లో టాప్‌–5లో నిలిచిన రెజ్లర్లు పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement