
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే భారత రైఫిల్, పిస్టల్ షూటింగ్ జట్టును మంగళవారం ప్రకటించారు. రెండు విభాగాల్లో కలిపి మొత్తం 15 మంది షూటర్లు విశ్వ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు.
తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లో పోటీపడనుంది. గత ఆసియా క్రీడల్లో, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 19 ఏళ్ల ఇషా సింగ్ 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకాలు గెలిచింది.
ఇటీవల నిర్వహించిన ట్రయల్స్‌లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ఈ బృందాన్ని ఎంపిక చేశారు. షూటింగ్ క్రీడాంశంలో అందుబాటులో ఉన్న 24 బెర్త్‌లకుగాను భారత షూటర్లు 21 బెర్త్‌లు గెల్చుకున్నారు. షాట్‌గన్ విభాగంలో పాల్గొనే భారత జట్టును జూన్ 18న ఇటలీలో ప్రపంచకప్ ముగిశాక ప్రకటిస్తారు.
చదవండి: 5000 మీటర్లలో గుల్‌వీర్ కొత్త జాతీయ రికార్డు