అదరగొట్టిన భారత హాకీ జట్టు.. ఐర్లాండ్‌పై ఘన విజయం | Paris Olympics 2024: Harmanpreet Singhs Brace Sees India Beat Ireland | Sakshi
Sakshi News home page

Paris Olympics: అదరగొట్టిన భారత హాకీ జట్టు.. ఐర్లాండ్‌పై ఘన విజయం

Jul 30 2024 7:16 PM | Updated on Jul 30 2024 8:13 PM

Paris Olympics 2024: Harmanpreet Singhs Brace Sees India Beat Ireland

ప్యారిస్ ఒలింపిక్స్‌-2024లో భార‌త పురుష‌ల‌ హాకీ జ‌ట్టు అద‌ర‌గొడుతోంది. పూల్‌-బిలో భాగంగా మంగ‌ళ‌వారం ఐర్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో భారత్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో భార‌త హాకీ జ‌ట్టు పూల్ బిలో అగ్ర‌స్ధానానికి చేరుకుంది.

దీంతో పూల్ బి నుండి టాప్ 4 క్వార్టర్ ఫైనల్లోకి వెళ్లే అవ‌కాశాల‌ను భార‌త్‌ మ‌రింత మెరుగుప‌రుచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లోనూ భార‌త కెప్టెన్ హ‌ర్మన్ ప్రీత్ సింగ్ స‌త్తాచాటాడు. భార‌త్ సాధించిన రెండు గోల్స్ కూడా హ‌ర్మ‌న్ కొట్టిన‌వే కావ‌డం గ‌మనార్హం.

11వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌లో గోల్ చేసిన హర్మన్‌ప్రీత్ సింగ్.. 19వ నిమిషంలో రెండో గోల్ చేశాడు. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఆగస్టు 1న బెల్జియంతో తలపడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement