Photo Credit: BCCI Twitter
టీమిండియాలో ప్రస్తుతం ఆల్‌రౌండర్ నమన్ ధీర్ ఒక సంచలనంగా మారిపోయాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌లో పర్వాలేదనిపించిన నమన్ ధీర్ న్యూజిలాండ్‌తో తొలి టీ20లో ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌తో ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారిపోయాడు. 15 బంతుల్లోనే 42 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన నమన్ ధీర్ రాకతో శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్‌రౌండర్ల కెరీర్ ప్రమాదంలో పడే అవకాశముందని భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ జోస్యం చెప్పాడు.
ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం కామెంటటేర్ అవతారం ఎత్తిన దినేశ్ కార్తిక్ గురువారం న్యూజిలాండ్, భారత్ తొలి టీ20కి కామెంటరీ చేశాడు. ఈ సందర్భంగా మ్యాచ్ ముగిసిన అనంతరం నమన్ ధీర్‌పై ప్రసంశల జల్లు కురిపించిన కార్తిక్ ఆల్‌రౌండర్‌గా అతడికి మంచి భవిష్యత్తు ఉందని కొనియాడాడు.

Photo Credit: BCCI Twitter
దినేశ్ కార్తిక్ మాట్లాడుతూ.. ‘ఈ సమయంలో శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్‌లపై ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే సుందర్ స్థానంలో నమన్ ధీర్ వచ్చాడు. కానీ వాషింగ్టన్ సుందర్ మూడు ఫార్మాట్లలో ఆడుతున్నప్పటికీ, సుందర్ ఎక్కువగా టెస్టు క్రికెట్ ఆడడంపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన నమన్ ధీర్ అంచనాలకు మించి రాణిస్తున్నాడు.
మూడో స్థానం నుంచి ఏడో స్థానం దాకా బ్యాటింగ్ చేయడంలో సమర్థుడు కావడం, బౌలింగ్‌లోనూ నిలకడగా రాణిస్తుండడం అతడికి సానుకూలాంశంగా మారింది. టెస్టు క్రికెట్‌లోనూ నమన్ ధీర్ ఎంట్రీ ఇస్తే అప్పుడు ఇది సుందర్‌కు ప్రతికూలంగా మారనుంది. ఇక రాబోయే రోజుల్లోనూ నమన్ ధీర్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మాత్రం శివమ్ దూబే, సుందర్‌ల కెరీర్ ప్రమాదంలో పడే అవకాశముంది.

Photo Credit: BCCI Twitter
బ్యాటింగ్‌లో దూకుడు స్వభావం, స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టడంలో సిద్ధహస్తుడైన నమన్ ధీర్ వల్ల సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు కూడా ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికిప్పుడు పాండ్యా జట్టులోకి తిరిగి వస్తే పక్కనబెట్టే సాహసం చేయనప్పటికీ, భవిష్యత్తులో మాత్రం నమన్ ధీర్ నుంచి అతడికి కఠిన సవాల్ ఎదురయ్యే అవకాశమైతే ఉంది.’ అని చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి: ఇర్ఫాన్ పఠాన్ రికార్డు బద్దలుకొట్టిన నమన్ ధీర్


