ఇర్ఫాన్ ప‌ఠాన్ రికార్డు బ‌ద్ద‌లుకొట్టిన న‌మ‌న్ ధీర్‌ | Naman Dhir Shatters-17-Years-Old-Record-Match-Winning-42-Not-out-Vs NZ | Sakshi
Sakshi News home page

ఇర్ఫాన్ ప‌ఠాన్ రికార్డు బ‌ద్ద‌లుకొట్టిన న‌మ‌న్ ధీర్‌

Oct 23 2026 11:14 AM | Updated on Oct 23 2026 11:28 AM

Naman Dhir Shatters-17-Years-Old-Record-Match-Winning-42-Not-out-Vs NZ

Photo Credit: BCCI Twitter

టీమిండియా ఆల్‌రౌండర్ నమన్ ధీర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాడు. ఇటీవలే విండీస్‌తో సిరీస్‌లో ఆకట్టుకున్న నమన్ ధీర్ గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో 15 బంతుల్లోనే 42 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో ఒక్కసారిగా వార్తల్లోకెక్కాడు. లోయర్ ఆర్డర్‌లో వేగవంతంగా ఆడగల నమన్ ధీర్ తొలి టీ20లో మెరుపు ఇన్నింగ్స్‌తో ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. 

అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో చేజింగ్‌లో (రెండో ఇన్నింగ్స్‌) భారత్ తరఫున ఏడు లేదా ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నమన్ ధీర్ నిలిచాడు. గతంలో ఇర్ఫాన్ పఠాన్ పేరిట ఈ రికార్డు ఉండేది. ఇర్ఫాన్ పఠాన్ 2009లో లంకతో మ్యాచ్‌లో ఛేదన సందర్భంగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 33 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. 

ఇప్పటివరకు పఠాన్‌దే అత్యుత్తమం కాగా, 17 ఏళ్ల తర్వాత నమన్ ధీర్ ఆ రికార్డును సవరించడం విశేషం. 42 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచిన న‌మ‌న్ ధీర్ 280 స్ట్రైక్‌రేట్‌తో ప‌రుగులు రాబ‌ట్ట‌డం విశేషం. అత‌డి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, రెండు భారీ సిక్స‌ర్లు ఉన్నాయి. నమ‌న్ మెరుపుల‌తో మ‌రో రెండు బంతులు మిగిలి ఉండ‌గానే ల‌క్ష్యాన్ని అందుకున్న భార‌త్ త‌మ అంత‌ర్జాతీయ‌ టీ20 క్రికెట్‌ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులను ఛేదించిన‌ట్ల‌యింది. 

ఇప్ప‌టివ‌ర‌కు న‌మ‌న్ ధీర్ ఆడిన ఐదు ఇన్నింగ్ష్‌ల్లో 285 స్ట్రైక్‌రేట్‌తో 80 ప‌రుగులు సాధించాడు. ఇక న‌మ‌న్ ధీర్ టీ20 క్రికెట్‌లో 16 నుంచి 20 ఓవ‌ర్ల మ‌ధ్య‌లో తాను ఎదుర్కొన్న 167 బంతుల్లోనే 341 ప‌రుగులు చేయ‌డం విశేషం. ఇందులో 34 ఫోర్లు, 19 సిక్స‌ర్లు ఉన్నాయి. తొలి టీ20 మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో నెగ్గిన టీమిండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 శనివారం క్రైస్ట్‌చర్చి వేదికగానే జరగనుంది.

 

ఇదీ చ‌ద‌వండి:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement