హీల్స్‌ ధరించి క్రికెట్‌ ఫీల్డ్‌లో తిరుగుతారా?

Pakistans First Woman Commentator Shuts Down Reporter - Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ మహిళా క్రికెట్‌ జట్టు మాజీ క్రికెటర్‌, ఆ దేశపు తొలి మహిళా కామెంటేటర్‌ మెరీనా ఇక్బాల్‌ను టార్గెట్‌ చేస్తూ  ఖాదిర్ ఖవాజా అనే స్పోర్ట్స్‌ జర్నలిస్టు కొన్ని ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. పాకిస్తాన్‌లోని ఓ క్రికెట్‌ మ్యాచ్‌కు సంబంధించిన ఫోటోలను పోస్ట్‌ చేసి ఏదో సంచలనాన్ని క్రియేట్‌ చేద్దామని చూశాడు. ఇందులో కామెంటేటర్‌గా వ్యహరించిన మెరీనా హై హీల్స్‌ ధరించిన ఫోటోలను షేర్‌ చేశాడు. ‘మీరు హీల్స్‌ ధరించి పిచ్‌ మొత్తం తిరగడం కరెక్ట్‌ అని అనుకుంటున్నారా? ఇది జస్ట్‌ తెలుసుకోవాలని అడుగుతున్నా’ అంటూ ప్రశ్నించాడు. ఆ ట్వీట్‌కు మెరీనా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది.  (చదవండి: ఆ క్రెడిట్‌ అంతా వారిదే: డుప్లెసిస్‌)

‘హాఫ్‌ నాలెడ్జ్‌ అనేది చాలా డేంజరస్‌. పిచ్‌పై నేను హై హీల్స్‌ ధరించి నడవలేదు. మ్యాచ్‌కు ముందు మాత్రమే హై హీల్స్‌ వేసుకున్నా. అంతేకానీ పిచ్‌పైకి వెళ్లినప్పుడు నేను ఫ్లాట్‌గా ఉన్న షూస్‌ వేసుకున్నా. నేను పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ననే విషయం మరవకండి. నిబంధనలు ఏమిటో నాకు తెలుసు.. మీరు నాకు చెప్పక్కర్లేదు. అంటూ కొన్ని ఫోటోలను కౌంటర్‌గా పోస్ట్‌ చేశారు మెరీనా.

మహిళా క్రికెటర్లను టార్గెట్‌ చేస్తూ అర్థపర్థం లేని ప్రశ్నలు వేయడం చాలా సందర్భాలు చూశాం. గతంలో భారత మహిళా వన్డే జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌కు ఒక చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఓ రిపోర్టర్..  పురుషుల క్రికెట్‌లో మీ ఫేవరేట్ ఎవరని అడిగాడు. ఈ అర్థం లేని ప్రశ్న మిథాలీకి విపరీతమైన కోపం తెప్పించింది. ఇదే ప్రశ్న పురుష క్రికెటర్లను అడుగుతారా? అని ఎదురు ప్రశ్నించింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top