ఆ క్రెడిట్‌ అంతా వారిదే: డుప్లెసిస్‌

Watson Thanks CSK Management For Keeping Faith - Sakshi

దుబాయ్‌: ఈ సీజన్‌ ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 10 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. హ్యాట్రిక్‌ ఓటములతో జూలు విదిల్చిన చెన్నై ఓ అతిపెద్ద విజయాన్ని అందుకుంది. షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌లు విశేషంగా రాణించడంతో సీఎస్‌కే 17.4 ఓవర్లలోనే కింగ్స్‌ పంజాబ్‌ నిర్దేశించిన 179 టార్గెన్‌ను ఛేదించింది. గత నాలుగ మ్యాచ్‌లుగా ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న వాట్సన్‌ ఫామ్‌లోకి రావడంతో సీఎస్‌కే బెంగ తీరడమే కాకుండా భారీ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో వాట్సన్‌ అజేయంగా 83 పరుగులు చేయగా, డుప్లెసిస్‌ 87 పరుగులు చేశాడు. ఎన్నో విమర్శలు చవిచూసి సరైన సమయంలో మెరిసిన వాట్సన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.(చదవండి: ఎంఎస్‌ ధోని మరో రికార్డు)

ఈ మేరకు డుప్లెసిస్‌ కలిసి తన అనుభవాన్ని షేర్‌ చేసుకున్న వాట్సన్‌ ఒక వీడియోను ఐపీఎల్‌ టీ20 డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. ‘ఆటగాళ్లపై నమ్మకం ఉంచడంలో ధోనిది ప్రత్యేకశైలి. ప్లేయర్స్‌పై విశ్వాసం ఉంచడంలో ధోని తీరు అసాధారణం. అలాగే కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ కూడా ఆటగాళ్లపై ఎక్కువ నమ్మకం ఉంచుతాడు. ఆటగాళ్ల నాణ్యత, సామర్థ్యాలని వీరు బాగా నమ్ముతారు. ఫామ్‌లో లేనప్పుడు క్రికెటర్లపై నమ్మకం ఉంచాలనే విషయం వారికి బాగా తెలుసు. అవే మార్పులు తీసుకొస్తాయని వారు భావిస్తారు.  నా మంచి స్నేహితుడు డుప్లెసిస్‌ కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నమోదు చేయడం ఆనందంగా ఉంది. చిన్న చిన్న విషయాల్లో మనల్ని మార్చుకుంటే అవి పెద్ద పెద్ద ఫలితాల్ని ఇస్తాయి.  ఇందుకు నా తాజా ఇన్నింగ్సే కారణం. సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌కు థాంక్స్‌ ’ అని వాట్సన్‌ తెలిపాడు. ఇక డుప్లెసిస్‌ మాట్లాడుతూ.. ‘ఇక్కడ క్రెడిట్‌ అంతా ఎంఎస్‌ ధోని. ఫ్లెమింగ్‌లకే దక్కుతుంది. అది సీఎస్‌కే స్టైల్‌ కూడా. ఫలానా ఆటగాడిలో సామర్థ్యం ఉంది అని భావిస్తే వారు దానికి కట్టుబడే అవకాశాలు ఇస్తూ ఉంటారు’ అని తెలిపాడు.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top