
ఆసియాకప్-2023 సూపర్-4లో భాగంగా కొలంబో వేదికగా ఆదివారం భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌తో జరిగే మ్యాచ్‌కు పాకిస్తాన్ తమ తుది జట్టును ముందు రోజే (శనివారం) ప్రకటించింది. టోర్నీ సూపర్-4 ఆరంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడిన టీమ్‌నే పాకిస్తాన్ కొనసాగించింది.
ఈ మ్యాచ్‌లో కూడా ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్‌ను పాక్ బెంచ్‌కే పరిమితం చేసింది. కాగా ఈ టోర్నీలో భారత్-పాక్ ఆడిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితన సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు భారత్ మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. శార్ధూల్ ఠాకూర్ స్ధానంలో బుమ్రా.. శ్రేయస్ అయ్యర్ ప్లేస్‌లో కేఎల్ రాహుల్ వచ్చే అవకాశం ఉంది.
టీమిండియాతో మ్యాచ్‌కు పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్:
ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సల్మాన్ అలీ ఆఘా, ఫాహీమ్ ఆష్రప్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, , షాహిన్ అఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్.
చదవండి: SA vs AUS: చరిత్ర సృష్టించిన వార్నర్.. సచిన్ వరల్డ్ రికార్డు బద్దలు