క్లాసెన్‌ ఊచకోత.. కేవలం 31 బంతుల్లోనే! వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

IPL 2024: క్లాసెన్‌ ఊచకోత.. కేవలం 31 బంతుల్లోనే! వీడియో వైరల్‌

Published Mon, Apr 15 2024 10:40 PM

The onslaught of Klaasen continues In IPL 2024 - Sakshi

ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్  ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ మరోసారి విధ్వంసం​ సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన క్లాసెన్ ఆర్సీబీ బౌలర్లను ఉతికారేశాడు.  

బౌల‌ర్‌తో సంబంధం లేకుండా సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో కేవ‌లం 31 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న క్లాసెన్‌.. 2 ఫోర్లు, 7 సిక్స్‌ల‌తో 67 ప‌రుగులు చేశాడు. అత‌డి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఇక  ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్  నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది.

ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక స్కోర్ న‌మోదు చేసిన జ‌ట్టుగా ఎస్ఆర్‌హెచ్ త‌న రికార్డును తానే బ్రేక్ చేసింది.  ఈ ఏడాది సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ 277 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు.  ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న హెడ్‌.. 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102 పరుగులు చేశాడు.

Advertisement
 
Advertisement