బీసీసీఐ అధికారికి కరోనా

One Of The BCCI Official Tested Positive Of Coronavirus - Sakshi

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) నిర్వహణా బాధ్యతలు చూసుకుంటోన్న భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికా రి ఒకరు తాజాగా కరోనా బారిన పడినట్లు సమాచారం. అయితే సదరు వ్యక్తి ఎవరనే దానిపై స్పష్టత లేదు. ‘బీసీసీఐ బృందంలో ఒక పాజిటివ్‌ కేసు వెలు గు చూసింది. అతను వైద్య బృం దం లేదా క్రికెట్‌ ఆపరేషన్స్‌ టీమ్‌కు చెందిన వ్యక్తా అనేది చెప్పలేం. ఇది మినహా అం తా బాగుంది.  ఆందోళ న చెందాల్సిన అవసరం లే దు’ అని ఐపీఎల్‌ వర్గాలు వెల్లడించాయి. 

ఐపీఎల్‌కు హర్భజన్‌ దూరం! 
సీనియర్‌ బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ ఐపీఎల్‌–2020నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతో అతను దూరం కానున్నాడని సమాచారం. అధికారికంగా భజ్జీ దీనిని ప్రకటించకపోయినా అతని తల్లి అనారోగ్యంతో ఉండటంతో యూఏఈ వెళ్లరాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం మంగళవారమే దుబాయ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు సహచరులతో కలవాల్సి ఉండగా హర్భజన్‌ ఇప్పటి వరకు వెళ్లలేదు.    

నేడు షెడ్యూల్‌... 
సెప్టెంబర్‌ 19నుంచి ఐపీఎల్‌ జరగాల్సి ఉండగా... ఇప్పటి వరకు ఏ మ్యాచ్‌ ఎప్పుడు జరుగుతుందో అభిమానులకు తెలీదు. అయితే టోర్నీ షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వెల్లడించాడు. ‘షెడ్యూల్‌ ఆలస్యం అయిందనేది వాస్తవం. ఇప్పుడే దానికి తుది మెరుగులు దిద్దుతున్నాం. శుక్రవారం ప్రకటిస్తాం’ అని సౌరవ్‌ స్పష్టం చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top