హైదరాబాద్‌లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనమతించబోమని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. దేశవాళీ టి20 టోర్నమెంట్‌లో భాగంగా గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. ఈ నెల 2న ఉప్పల్ స్టేడియంలో పంజాబ్, బరోడా జట్ల మధ్య మ్యాచ్ జరగగా... పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
భారత స్టార్ ఆటగాళ్లుహార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ ఆడుతుండటంతో వారిని చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. సరైన సెక్యూరిటీ లేకపోవడంతో... పలువురు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లి స్టార్ ప్లేయర్‌లతో సెల్ఫీలు సైతం దిగారు. దీనిపై సర్వత్ర విమర్శలు వ్యక్తంకావడంతో... ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని తాజాగా హెచ్‌సీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ఉప్పల్‌తో పాటు జింఖానా మైదానంలో సోమవారం జరిగే మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించబోమని హెచ్‌సీఏ తెలిపింది.


