
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో మ్యాచ్‌లో న్యూజిలాండ్ క్రీడా స్పూర్తిని ప్రదర్శించింది. ఓవర్‌త్రో కారణంగా అదనపు పరుగులు చేసే అవకాశం వచ్చినప్పటికీ న్యూజిలాండ్ బ్యాటర్లు తిరష్కరించారు.
ఏం జరిగిందంటే?
కివీస్ ఇన్నింగ్స్ 24 ఓవర్ వేసిన జడేజా బౌలింగ్‌లో నాలుగో బంతిని రచిన్ రవీంద్ర స్వ్కెర్ లెగ్ దిశగా ఆడాడు. దీంతో రవీంద్ర, మిచెల్ రెండు పరుగులు పూర్తి చేసుకున్నారు. అయితే రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో స్వ్కెర్ లెగ్ ఫీల్డర్ నాన్‌స్ట్రైకర్ వైపు త్రో చేశాడు. అయితే త్రో సరిగ్గా లేకపోవడంతో జడేజా బంతిని అందుకోలేకపోయాడు.
ఈ క్రమంలో ఓవర్‌త్రో రూపంలో అదనపు పరుగు తీసే అవకాశం కివీస్‌కు లభించింది. సరిగ్గా ఇదే సమయంలో న్యూజిలాండ్ బ్యాటర్లు తమ క్రీడా స్పూర్తి చాటుకున్నారు. అదనపు పరుగుతీసేందుకు కివీస్ బ్యాటర్లు ఇద్దరూ కూడా తిరష్కరించారు. దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా లేచి చప్పట్లు కొడుతూ అభినందించారు.
చదవండి: IND vs NZ World Cup 2023: మహ్మద్ షమీ అరుదైన ఘనత.. అనిల్ కుంబ్లే రికార్డు బద్దలు