పాపం మార్క్రమ్‌.. ఏంటి కావ్య పాప ఇది? మరీ ఇంత అన్యాయమా? | Netizens question SRHs treatment of captain Aiden Markram due to Aussie skipper Pat Cummins | Sakshi
Sakshi News home page

IPL 2024: పాపం మార్క్రమ్‌.. ఏంటి కావ్య పాప ఇది? మరీ ఇంత అన్యాయమా?

Mar 4 2024 12:50 PM | Updated on Mar 4 2024 1:31 PM

Netizens question SRHs treatment of captain Aiden Markram due to Aussie skipper Pat Cummins - Sakshi

ఐపీఎల్‌-2024 సీజన్‌ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఆ జట్టు కెప్టెన్‌, సౌతాఫ్రికా స్టార్‌ ఐడైన్‌ మార్‌క్రమ్‌కు ఊహించని షాకిచ్చింది. మార్‌క్రమ్‌ను తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఎస్‌ఆర్‌హెచ్‌ తప్పించింది. అతడి స్ధానంలో వన్డే ప్రపంచకప్‌ 2023 విన్నింగ్‌ కెప్టెన్‌, ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌కు జట్టు పగ్గాలను సన్‌రైజర్స్‌ అప్పగించింది. ఈ మెరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది.

కాగా మినీ వేలంలో ఫ్రాంచైజీ కమిన్స్‌ను రూ.20.50 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎస్‌ఆర్‌హెచ్‌ తీసుకున్న నిర్ణయంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది కమ్మిన్స్‌ను సారథిగా నియమించడాన్ని సమర్ధిస్తుంటే.. మరి కొంత మంది తప్పుబడుతున్నారు. మారక్రమ్‌ అద్బుతమైన నాయకుడని, అతడికి మరో ఛాన్స్‌ ఇవ్వాలందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

మీ ఫ్రాంచైజీని వరుసగా రెండు సార్లు నిలిపిన ఆటగాడికి అన్యాయం చేశారని ఎస్‌ఆర్‌హెచ్‌ ఓనర్‌ కావ్య మారన్‌ను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీకి చెందిన సన్‌రైజర్స్ ఈస్టెర్న్ కేప్ జట్టును మార్క్‌రమ్ వరుసగా రెండుసార్లు చాంపియన్‌గా నిలబెట్టాడు. గతేడాది ప్రారంభ సీజన్‌లోనే జట్టును విజేతగా నిలిపిన అతను.. ఇటీవల రెండో సీజన్‌లోనూ టైటిల్‌ను అందించాడు.

అయితే ఐపీఎల్‌లో మాత్రం మార్‌క్రమ్‌ తన కెప్టెన్సీ మార్క్‌ను చూపించలేకపోయాడు. గత సీజన్‌లో ఎయిడెన్‌ మార్‌క్రమ్‌ సారథ్యంలో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ పేలవ ప్రదర్శన కనబర్చింది. ఆడిన 14 మ్యాచుల్లో నాలుగింట్లో మాత్రమే గెలిచింది. పది మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు నిలిచింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement