మోటార్‌ స్పోర్ట్‌ టీమ్‌ యజమానిగా నాగ చైతన్య  | Naga Chaitanya Acquires Ownership Of Hyderabad Motorsport Racing Team Blackbirds, Deets Inside - Sakshi
Sakshi News home page

మోటార్‌ స్పోర్ట్‌ టీమ్‌ యజమానిగా నాగ చైతన్య 

Sep 15 2023 1:44 AM | Updated on Sep 15 2023 10:56 AM

Naga Chaitanya as the owner of the motor sport team - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మోటార్‌ స్పోర్ట్‌ రేసింగ్‌లో తెలుగు హీరో అక్కినేని నాగచైతన్య భాగమయ్యాడు. ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఆర్‌ఎల్‌)లో ఒక జట్టయిన ‘హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌’ను అతను కొనుగోలు చేశాడు. ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ గత సీజన్‌లో నాలుగు రేస్‌లు గెలిచిన ఈ టీమ్‌ త్వరలో తొలిసారి నిర్వహించనున్న ‘ ఎఫ్‌ఐఏ ఫార్ములా–4 ఇండియన్‌ చాంపియన్‌షిప్‌’లో కూడా పాల్గొనబోతోంది.

2022 సీజన్‌లో బ్లాక్‌బర్డ్స్‌ జట్టుకే చెందిన అఖిల్‌ రవీంద్ర డ్రైవర్స్‌ టైటిల్‌ విజేతగా నిలిచాడు. టీమ్‌ చాంపియన్‌íÙప్‌లో బ్లాక్‌ బర్డ్స్‌కు రెండో స్థానం దక్కింది. అఖిల్‌తో పాటు స్విట్జర్లాండ్‌కు చెందిన నీల్‌ జానీ ఈ టీమ్‌లో మరో డ్రైవర్‌గా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి మోటార్‌ రేసింగ్‌ను ఎంతో ఇష్టపడే తాను ఇప్పుడు టీమ్‌ యజమానిగా రేసింగ్‌ బృందంలో భాగం కావడం సంతోషంగా ఉందని నాగచైతన్య వ్యాఖ్యానించాడు.  

Advertisement
 
Advertisement
Advertisement