అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ పెళ్లి తర్వాత చేస్తున్న మొదటి సినిమా చీకటిలో. ఈ మూవీని నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. ఇందులో శోభిత క్రైమ్ యాంకర్ సంధ్యగా కనిపించింది. మొదట జర్నలిస్ట్‌గా పనిచేసినా.. తర్వాత జాబ్ నచ్చలేదని మానేసి పాడ్‌కాస్ట్ ప్రారంభించింది. ఆ పాడ్‌కాస్ట్‌కు చీకటిలో అన్న టైటిల్ ఖరారు చేసింది.
ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీ అయిపోయింది శోభిత. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైంది. ఈ ప్రమోషన్ ఈవెంట్‌కు ఆమె భర్త నాగ చైతన్య కూడా వచ్చారు. తన సతీమణితో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. ఈ మూవీలో శోభితతో పాటు విశ్వదేవ్ రాచకొండ, చైతన్య విశాలక్ష్మి, ఈషా చావ్లా, జాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈ చిత్రం జనవరి 23న నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
#TFNExclusive: The beautiful couple Yuvasamrat #NagaChaitanya & #SobhitaDhulipala snapped together at a movie event 📸✨#SoChay #TeluguFilmNagar pic.twitter.com/pojTTChD9l
— Telugu FilmNagar (@telugufilmnagar) January 20, 2026


