2 ప‌రుగులే 6 వికెట్లు.. 152 ఏళ్ల క్రికెట్‌ చ‌రిత్ర‌లోనే | Mumbais 6-2 Carnage Forces Meghalaya To Enter Humiliating List | Sakshi
Sakshi News home page

RT 2024-25: 2 ప‌రుగులే 6 వికెట్లు.. 152 ఏళ్ల క్రికెట్‌ చ‌రిత్ర‌లోనే

Jan 30 2025 2:06 PM | Updated on Jan 30 2025 2:46 PM

Mumbais 6-2 Carnage Forces Meghalaya To Enter Humiliating List

మేఘాలయ బ్యాట‌ర్లు దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన మేఘాలయ త‌మ మొదటి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 86 ప‌రుగులకే ఆలౌటైంది. ఆరంభంలోనే ముంబై స్టార్ ఆల్‌రౌండ‌ర్ శార్ధూల్‌ ఠాకూర్‌(Shardul Thakur) హ్యాట్రిక్ వికెట్ల‌ను ప‌డ‌గొట్టి దెబ్బ‌తీశాడు. అతడి ధాటికి మేఘాల‌య కేవ‌లం 2 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయింది. ఈ క్ర‌మంలో మేఘాల‌య అత్యంత చెత్త రికార్డును త‌మ పేరిట లిఖించుకుంది.

152 ఏళ్ల ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ హిస్ట‌రీలోనే తొలి ఆరు వికెట్లకు అత్య‌ల్ప స్కోర్ చేసిన రెండో జ‌ట్టుగా మేఘాల‌య నిలిచింది. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో ఎసీసీ క్రికెట్ క్ల‌బ్ అగ్ర‌స్ధానంలో ఉంది. 1872లో లార్డ్స్‌లో స‌ర్రేతో జ‌రిగిన మ్యాచ్‌లో ఎంసీసీ ఖాతా తెర‌వ‌కుండానే తొలి 6 వికెట్ల‌ను కోల్పోయింది. ఈ లిస్ట్‌లో ఎంసీసీ, మేఘాల‌య త‌ర్వాతి స్ధానాల్లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (3-6), లీసెస్టర్‌షైర్(4-6), నార్తాంప్టన్‌షైర్(4-6) ఉన్నాయి

నాలుగేసిన శార్ధూల్‌..
ఇక ఈ మ్యాచ్‌లో శార్థూల్ ఠాకూర్ హ్యాట్రిక్ వికెట్ల‌తో మెరిశాడు. మేఘాల‌య ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్ వేసిన లార్డ్ శార్ధూల్‌.. బి అనిరుధ్, సుమిత్ కుమార్, జస్కిరత్‌లను వ‌రుస బంతుల్లో ఔట్ చేశాడు. ఓవ‌రాల్‌గా 11 ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన ఠాకూర్‌.. 43 ప‌రుగులిచ్చి 4 వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు.

అత‌డితో పాటు మొహిత్ అవ‌స్థి మూడు, సిల్వ‌స్ట‌ర్ డిసౌజా రెండు , షామ్స్ ములానీ ఒక్క వికెట్ సాధించారు. మేఘాల‌య  బ్యాట‌ర్ల‌లో టెయిలాండ‌ర్ హీమ్యాన్‌(28) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.
చదవండి: RT 2025: హ్యాట్రిక్‌తో చెలరేగిన శార్ధూల్‌.. టీమిండియాలోకి రీ ఎంట్రీకి సిద్దం

Advertisement
 
Advertisement
Advertisement