క్రికెటర్‌ ఆత్మహత్య

Mumbai Cricket Player Karan Tiwary Departed At His Home - Sakshi

ముంబై: మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఓ క్రికెటర్‌ ఆత్మహత్మ చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కరణ్‌ తివాతీ(27) అనే క్రికెట్‌ ప్లేయర్‌ సోమవారం ఉ‍త్తర ముంబైలోని మలాద్‌ ప్రాంతంలో తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కరణ్‌ ముంబై ప్రొఫెషనల్‌ జట్టుకు నెట్‌ ప్రాక్టిస్‌ బౌలర్‌. కరోనా వైరస్‌ కారణంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్‌కు సంబంధించి పలు టోర్నీలు, మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. దీంతో కరణ్‌ తన క్రికెట్‌ కెరీర్‌ పట్ల ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు కురార్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. (అభిమానితో సెల్ఫీ అతనికి శాపంగా మారింది )

‌ ముంబై మలాద్‌ ప్రాంతంలోని సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన కరణ్ కెరీర్‌లో సరైన అవకాశాలు రావడంలేదని తన స్నేహితులతో చెప్పేవాడని పోలీసులు పేర్కొన్నారు. ముంబై సీనియర్‌ జట్టులో చోటు కోసం కరణ్‌ పలుమార్లు ప్రయత్నించినప్పటికీ విఫలమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కరోనా వైరస్‌ కారణంగా నిలిచిపోయిన మ్యాచ్‌ల వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. అతని మృతి పట్ల నటుడు జితు వర్మ విచారం వ్యక్తం చేశారు. కరణ్‌ చాలా ఏళ్లుగా క్రికెట్‌లో ఎదగడానికి కష్టపడుతున్నాడని పేర్కొన్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top