IPL 2021: ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమైన ధోని.. ఫోటోలు వైరల్‌ | MS Dhoni Spotted At Chennai Airport CSK Players Leave For Dubai Viral | Sakshi
Sakshi News home page

IPL 2021: ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమైన ధోని.. ఫోటోలు వైరల్‌

Aug 13 2021 4:43 PM | Updated on Aug 13 2021 4:46 PM

MS Dhoni Spotted At Chennai Airport CSK Players Leave For Dubai Viral - Sakshi

చెన్నై: సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో అంచె మ్యాచ్‌లు మొదలవనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ దుబాయ్‌కు పయనమయ్యాయి. కాగా సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఎయిర్‌పోర్ట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్‌తో ఉన్న ధోని పీపీఈ కిట్‌ ధరించడంతో డ్రెస్సింగ్‌ స్టైల్‌ కాస్త కొత్తగా అనిపించింది.

ధోనితో పాటు సురేశ్‌ రైనా, కర్ణ్‌ శర్మ, రుతురాజ్‌ గైక్వాడ్‌, దీపక్‌ చహర్‌, అంబటి రాయుడులు కూడా దుబాయ్‌ ఫ్లైట్‌ ఎక్కారు. అటు ముంబై ఇండియన్స్‌ జట్టు కూడా యూఏఈ బయలుదేరి వెళ్లింది. కాగా సెప్టెంబర్‌ 19 నుంచి మొదలుకానున్న రెండో అంచె పోటీల్లో తొలి మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌, సీఎస్‌కే మధ్య జరగనుంది. ఇక ఈ సీజన్‌లో సీఎస్‌కే మంచి ప్రదర్శన కనబరిచింది. ఏడు మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే ఐదు విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇక ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు అందుకొని టాప్‌లో కొనసాగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement