Mohammed-Siraj Sledges Najmul Hossain Shanto-Reaction Became Viral - Sakshi
Sakshi News home page

Mohammed Siraj: బంగ్లా క్రికెటర్‌తో వైరం.. ఈసారి మనోడిదే తప్పా!

Dec 17 2022 3:41 PM | Updated on Dec 17 2022 4:14 PM

Mohammed-Siraj Sledges Najmul Hossain Shanto-Reaction Became Viral - Sakshi

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం దిశగా పరుగులు తీస్తుంది. 513 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు ప్రస్తుతం ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. బంగ్లా గెలవాలంటే మరో 268 పరుగులు చేయాల్సి ఉంది. ఆటకు మరోరోజు మిగిలి ఉండడంతో టీమిండియా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ సంగతి పక్కనబెడితే.. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్‌, లిటన్‌దాస్‌ మధ్య చిన్నపాటి మాటల యుద్ధం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత లిటన్‌దాస్‌ సిరాజ్‌ ఏం చెబుతున్నాడో అర్థం కానట్లు.. చెవి దగ్గర చేయిని పెట్టి ఏదీ మళ్లీ చెప్పు అంటూ సైగ చేశాడు. ఆ తర్వాత బంతికే లిటన్‌దాస్‌ క్లీన్‌బౌల్డ్‌ కావడం.. కోహ్లి సైగ​ చేయడం.. సిరాజ్‌ అనుకరించడం చకచకా జరిగిపోయింది. 

అయితే తాజాగా రెండో ఇన్నింగ్స్‌లో 34వ ఓవర్‌లో సిరాజ్‌, నజ్ముల్‌ హొస్సేన్‌ షాంటో మధ్య మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి షాంటో లిటన్‌దాస్‌లో ప్రవర్తించకుండా కూల్‌గా కనిపించాడు. కానీ సిరాజ్‌ మాత్రం షాంటోకు సీరియస్‌ లుక్‌ ఇస్తూ మాటల తూటాలు పేల్చాడు. అయితే సిరాజ్‌ ఏం అంటున్నా నవ్వు మొహంతోనే కనిపించాడు షాంటో. ఆ తర్వాత బంతిని వేసిన సిరాజ్‌ మరోసారి షాంటోతో ఏదో మాట్లాడాడు. దానికి షాంటో సిరాజ్‌వైపు సీరియస్‌గా చూస్తూ నిలబడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయంది.

చదవండి: కోహ్లి సైగ చేశాడు.. సిరాజ్‌ అనుకరించాడు; ఒళ్లు మండినట్టుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement