వచ్చే ఏడాది ఎఫ్‌1లోకి మిక్‌ షుమాకర్‌

Mic Shoemaker To Ready Next Years F1 Season - Sakshi

హాస్‌ జట్టు ప్రధాన డ్రైవర్‌గా నియామకం

సాఖిర్‌ (బహ్రెయిన్‌): ఫార్ములావన్‌ (ఎఫ్‌1) దిగ్గజ డ్రైవర్‌ మైకేల్‌ షుమాకర్‌ తనయుడు మిక్‌ షుమాకర్‌ వచ్చే ఏడాది ఎఫ్‌1లోకి అరంగేట్రం చేయనున్నాడు. ఈ మేరకు 2021 సీజన్‌ కోసం అమెరికాకు చెందిన హాస్‌ జట్టు 21 ఏళ్ల మిక్‌ షుమాకర్‌తో ఒప్పందం చేసుకుంది. వచ్చే సంవత్సరంలో మిక్‌ షుమాకర్‌తోపాటు నికిటా మేజ్‌పిన్‌ (రష్యా) హాస్‌ జట్టు ప్రధాన డ్రైవర్లుగా వ్యవహరిస్తారు.

ఈ ఏడాది తమ జట్టు ప్రధాన డ్రైవర్లు ఉన్న రొమైన్‌ గ్రోస్యెన్, కెవిన్‌ మాగ్నుసన్‌లను ఈ సీజన్‌ తర్వాత కొనసాగించడంలేదని హాస్‌ జట్టు తెలిపింది. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 51 ఏళ్ల మైకేల్‌ షుమాకర్‌ 2012లో ఎఫ్‌1 నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. 2013లో డిసెంబర్‌ 29న తనయుడు మిక్‌తో కలిసి షుమాకర్‌ ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్‌ పర్వతాల్లో స్కీయింగ్‌ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. ఏడేళ్లుగా షుమాకర్‌కు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఫార్ములా–2 చాంపియన్‌షిప్‌లో ప్రెమా రేసింగ్‌ జట్టు తరఫున డ్రైవర్‌గా ఉన్న మిక్‌ 205 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top