Max Verstappen wins Austrian Grand Prix to extend series lead - Sakshi
Sakshi News home page

ఆస్ట్రియన్‌ గ్రాండ్‌ప్రి విజేత వెర్‌స్టాపెన్‌.. సీజన్‌లో వరుసగా ఐదో  టైటిల్‌ 

Jul 3 2023 9:11 AM | Updated on Jul 3 2023 9:31 AM

Max Verstappen Wins Austrian Grand Prix - Sakshi

స్పిల్‌బర్గ్‌: ఫార్ములా వన్‌లో చాంపియన్‌ రేసర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఎదురే లేని జోరుతో దూసుకెళుతున్నాడు. ఆదివారం ఆస్ట్రియన్‌ గ్రాండ్‌ప్రిలో ఈ రెడ్‌బుల్‌ డ్రైవర్‌ విజేతగా నిలిచాడు. ఈ ట్రాక్‌పై తనకు పోటీనిచ్చిన ఫెరారీ రేసర్‌ చార్లెస్‌ లెక్‌లెర్క్‌ను వెనక్కి నెట్టి తన వేగంతో అగ్ర స్థానంలో నిలిచాడు. దీంతో నిరుటి విజేత లెక్‌లెర్క్‌ రెండో స్థానంతో తృప్తి చెందాడు.

పోల్‌ పొజిషన్‌తో రేసును ప్రారంభించిన వెర్‌స్టాపెన్‌ 71 ల్యాపుల్ని అందరికంటే ముందుగా ఒక గంటా 25 నిమిషాల 33.607 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో 25 ఏళ్ల ఈ డచ్‌ డ్రైవర్‌కిది వరుసగా ఐదో విజయం కాగా... ఓవరాల్‌గా ఇప్పటివరకు జరిగిన 9 రేసుల్లో ఏడో విజయాన్ని నమోదు చేశాడు. దీంతో 377 పాయింట్లతో రెడ్‌బుల్‌ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇదే జట్టుకు చెందిన సెర్గియో పెరెజ్‌ మూడో స్థానంలో నిలిచాడు. తదుపరి రేసు బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రి ఈ నెల 9న సిల్వర్‌స్టోన్‌ సర్క్యూట్‌పై జరుగుతుంది.   
 

Advertisement
 
Advertisement
Advertisement