ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి విజేత వెర్‌స్టాపెన్‌  | Max Verstappen wins Austrian Grand Prix | Sakshi
Sakshi News home page

ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి విజేత వెర్‌స్టాపెన్‌ 

Jul 1 2019 10:03 AM | Updated on Jul 1 2019 1:47 PM

Max Verstappen wins Austrian Grand Prix - Sakshi

మాక్స్‌ వెర్‌స్టాపెన్‌

స్పీల్‌బెర్గ్‌ (ఆస్ట్రియా): ఈ ఏడాది ఫార్ము లావన్‌ సీజన్‌లో ఎట్టకేలకు తొమ్మిదో రేసులో మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ కాకుండా మరో జట్టు డ్రైవర్‌కు టైటిల్‌ లభించింది. ఆదివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. 71 ల్యాప్‌ల ఈ రేసును వెర్‌స్టాపెన్‌ గంటా 22 నిమిషాల 01.822 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని పొందాడు. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును మొదలుపెట్టిన లెక్‌లెర్క్‌ (ఫెరారీ)ను 69వ ల్యాప్‌లో వెర్‌స్టాపెన్‌ ఓవర్‌టేక్‌ చేసి ఆధిక్యంలోకి వెళ్లాడు. లెక్‌లెర్క్‌కు రెండో స్థానం దక్కగా... బొటాస్‌ (మెర్సిడెస్‌) మూడో స్థానాన్ని పొందాడు. వెటెల్‌ (ఫెరారీ), హామిల్టన్‌ (మెర్సిడెస్‌) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఈ సీజన్‌లోని తొలి ఎనిమిది రేసుల్లో ఆరింటిలో హామిల్టన్‌ (మెర్సిడెస్‌), రెండింటిలో బొటాస్‌ (మెర్సిడెస్‌) టైటిల్‌ సాధించారు. తదుపరి రేసు బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రి ఈనెల 14న జరుగుతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement