వెర్‌స్టాపెన్‌కే ‘పోల్‌’  | Max Verstappen Takes Pole Position For Styrian GP | Sakshi
Sakshi News home page

వెర్‌స్టాపెన్‌కే ‘పోల్‌’ 

Jun 27 2021 9:54 AM | Updated on Jun 27 2021 9:54 AM

Max Verstappen Takes Pole Position For Styrian GP - Sakshi

స్పీల్‌బెర్గ్‌ (ఆస్ట్రియా): రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఈ సీజన్‌లో మూడో పోల్‌ పొజిషన్‌ సాధించాడు. శనివారం జరిగిన స్టిరియన్‌ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ సెషన్‌లో వెర్‌స్టాపెన్‌ అందరికంటే వేగంగా ల్యాప్‌ను 1ని:03.841 సెకన్లలో ముగించాడు.

తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. మెర్సిడెస్‌ డ్రైవర్‌ హామిల్టన్‌ రెండో స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏడు  రేసులు జరగ్గా... రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్లు నాలుగు రేసుల్లో విజేతగా నిలిచారు. వెర్‌స్టాపెన్‌ మూడు రేసుల్లో... పెరెజ్‌ ఒక రేసులో గెలిచారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement