T20 World Cup Records: టీ20 వరల్డ్‌కప్‌లో అత్యుత్తమ రికార్డులివే

List Of T20 World Cup Records - Sakshi

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న 8వ టీ20 వరల్డ్‌కప్‌ ప్రారంభమైన మూడు రోజుల్లోనే సంచలనాలకు వేదికైంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పసికూన నమీబియా.. ఆసియా ఛాంపియన్‌ శ్రీలంకకు షాకివ్వగా, రెండో రోజు మరో పసికూన స్కాట్లాండ్‌.. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ వెస్టిండీస్‌కు ఫ్యూజులు ఎగరగొట్టింది. విజయాల పరంగా ఈ రోజు అంతటి సంచలనం నమోదు కానప్పటికీ.. వ్యక్తిగత విభాగంలో ఓ రికార్డు నమోదైంది. శ్రీలంక-యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్‌లో యూఏఈ యువ స్పిన్నర్‌ కార్తీక్‌ మెయప్పన్‌ హ్యాట్రిక్‌ సాధించి ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా, టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో హ్యాట్రిక్‌ సాధించిన 5వ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 

ఓవరాల్‌గా టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు నమోదైన రికార్డులు, వాటి వివరాలపై ఓ లుక్కేద్దాం..

2007లో పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభమైన నాటి నుంచి చాలా రికార్డులు నమోదయ్యాయి. వాటిలో కొన్ని ఎప్పటికప్పుడు ఛేదించబడగా.. మరికొన్ని ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉండిపోయాయి. వివరాల్లోకి వెళితే..

  • టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకు కేవలం వెస్టిండీస్‌ (2012, 2016) మాత్రమే రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది
  • టోర్నీ చరిత్రలో ఆతిధ్య జట్లు కప్‌ గెలిచిన దాఖలాలు లేవు, అలాగే వరుసగా ఏ జట్టు రెండు సార్లు కప్‌ నెగ్గింది లేదు
  • ఇప్పటివరకు జరిగిన 8 పొట్టి ప్రపంచకప్‌లు ఆడిన ఆటగాళ్లు:  రోహిత్ శర్మ, షకిబ్ అల్‌ హసన్‌
  • అత్యధిక టీమ్‌ స్కోర్‌: 260/6 (2007లో కెన్యాపై శ్రీలంక చేసింది)
  • అత్యల్ప స్కోర్‌: 39 ఆలౌట్‌ (2014లో నెదర్లాండ్స్‌)
  • అత్యధిక సార్లు  ఫైనల్‌కు చేరిన జట్టు: శ్రీలంక (2009, 2012, 2014) 
  • ఫాస్టెస్ట్ ఫిఫ్టీ: యువరాజ్ సింగ్ (2007లో ఇంగ్లండ్‌పై 12 బంతుల్లో) 
  • ఫాస్టెస్ట్ హండ్రెడ్: క్రిస్ గేల్ (2016లో ఇంగ్లండ్ పై గేల్ 48 బంతుల్లో)
  • అత్యధిక సెంచరీలు: క్రిస్‌ గేల్‌ (2) (2007, 2016)
  • అత్యధిక హాఫ్‌ సెంచరీలు: విరాట్‌ కోహ్లి (10)
  • అత్యధిక వ్యక్తిగత స్కోర్‌: బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (123)
  • అత్యధిక సగటు: విరాట్‌ కోహ్లి (76.81)
  • అత్యధిక స్ట్రయిక్‌ రేట్‌: డారెన్‌ స్యామీ (164.12)
  • అత్యధిక సిక్సర్లు: క్రిస్‌ గేల్‌ (61)
  • అత్యధిక ఫోర్లు: మహేళ జయవర్ధనే (111)
  • అత్యధిక పరుగులు: మహేళ జయవర్ధనే (31 మ్యాచ్‌ల్లో 1016 పరుగులు) 
  • అత్యధిక వికెట్లు: షకిబ్ అల్ హసన్ (31 మ్యాచ్‌ల్లో 41 వికెట్లు) 
  • మోస్ట్ డిస్మిసల్: ఎంఎస్ ధోని (21 క్యాచ్ లు, 11 స్టంపింగ్స్) 
  • అత్యధిక క్యాచ్‌లు (ఫీల్డర్‌): ఏబీ డివిలియర్స్ (23) 
     

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top