breaking news
Records list
-
డబుల్ సెంచరీతో రికార్డుల మోత మోగించిన శుభ్‌మన్ గిల్
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 145 బంతులను ఎదుర్కొన్న గిల్.. 19 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 208 పరుగులు చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో తొలిసారి ఈ ఫీట్ (డబుల్ సెంచరీ) సాధించిన గిల్ హ్యాట్రిక్ సిక్సర్లతో 200 మార్క్‌ను చేరుకున్నాడు. డబుల్ సెంచరీ సాధించే క్రమంలో గిల్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. అవేంటంటే.. అత్యంత పిన్న వయసులో (23 ఏళ్ల 132 రోజులు) డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు. ఇంతకుముందు ఈ రికార్డు ఇషాన్ కిషన్ (24 ఏళ్ల 145 రోజులు) పేరిట ఉండేది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో అత్యధిక స్కోర్ రికార్డు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (2009లో ఆసీస్‌పై 175 పరుగులు) పేరిట ఉండేది. ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరర్ (గిల్, 208), రెండో అత్యధిక స్కోరర్ (రోహిత్, 34) మధ్య రన్స్ గ్యాప్ రికార్డు. ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్ 264 పరుగులు చేసిన మ్యాచ్‌లో రెండో అత్యధిక స్కోరర్‌గా విరాట్ కోహ్లి (66) ఉన్నాడు. వీరిద్దరి మధ్య 198 పరుగుల తేడా ఉంది. ఇవాళ్టి మ్యాచ్‌లో గిల్, రోహిత్‌ల మధ్య 174 పరుగుల తేడాతో ఉంది. రన్స్ గ్యాప్ రికార్డ్స్ జాబితాలో గిల్ది మూడో స్థానం. వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోర్. గతంలో ఈ రికార్డు సచిన్ (186 నాటౌట్) పేరిట ఉండేది. వరుస వన్డే ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, డబుల్ సెంచరీతో పాటు హ్యాట్రిక్ సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేసిన ఘనత. అతి తక్కువ వన్డేల్లో (19) 3 సెంచరీలు చేసిన ఆటగాడిగా శిఖర్ ధవన్ (17) తర్వాతి స్థానం. వన్డేల్లో అతి వేగంగా (19 మ్యాచ్‌ల్లో) 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డు. ఈ రికార్డు పాక్ ఆటగాడు ఫకర్ జమాన్ (18) పేరిట ఉంది. భారత్ తరఫున అతి వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు. విరాట్ కోహ్లి, శిఖర్ ధవన్ (24 మ్యాచ్‌లు) సంయుక్తంగా రెండో ప్లేస్‌లో ఉన్నారు. -
నష్టాల్లోనూ రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్
-
టీ20 వరల్డ్‌కప్‌లో అత్యుత్తమ రికార్డులివే
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న 8వ టీ20 వరల్డ్‌కప్ ప్రారంభమైన మూడు రోజుల్లోనే సంచలనాలకు వేదికైంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పసికూన నమీబియా.. ఆసియా ఛాంపియన్ శ్రీలంకకు షాకివ్వగా, రెండో రోజు మరో పసికూన స్కాట్లాండ్.. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్‌కు ఫ్యూజులు ఎగరగొట్టింది. విజయాల పరంగా ఈ రోజు అంతటి సంచలనం నమోదు కానప్పటికీ.. వ్యక్తిగత విభాగంలో ఓ రికార్డు నమోదైంది. శ్రీలంక-యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్‌లో యూఏఈ యువ స్పిన్నర్ కార్తీక్ మెయప్పన్ హ్యాట్రిక్ సాధించి ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా, టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన 5వ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్‌గా టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు నమోదైన రికార్డులు, వాటి వివరాలపై ఓ లుక్కేద్దాం.. 2007లో పొట్టి ప్రపంచకప్ ప్రారంభమైన నాటి నుంచి చాలా రికార్డులు నమోదయ్యాయి. వాటిలో కొన్ని ఎప్పటికప్పుడు ఛేదించబడగా.. మరికొన్ని ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉండిపోయాయి. వివరాల్లోకి వెళితే.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం వెస్టిండీస్ (2012, 2016) మాత్రమే రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది టోర్నీ చరిత్రలో ఆతిధ్య జట్లు కప్ గెలిచిన దాఖలాలు లేవు, అలాగే వరుసగా ఏ జట్టు రెండు సార్లు కప్ నెగ్గింది లేదు ఇప్పటివరకు జరిగిన 8 పొట్టి ప్రపంచకప్‌లు ఆడిన ఆటగాళ్లు: రోహిత్ శర్మ, షకిబ్ అల్ హసన్ అత్యధిక టీమ్ స్కోర్: 260/6 (2007లో కెన్యాపై శ్రీలంక చేసింది) అత్యల్ప స్కోర్: 39 ఆలౌట్ (2014లో నెదర్లాండ్స్) అత్యధిక సార్లు ఫైనల్‌కు చేరిన జట్టు: శ్రీలంక (2009, 2012, 2014) ఫాస్టెస్ట్ ఫిఫ్టీ: యువరాజ్ సింగ్ (2007లో ఇంగ్లండ్‌పై 12 బంతుల్లో) ఫాస్టెస్ట్ హండ్రెడ్: క్రిస్ గేల్ (2016లో ఇంగ్లండ్ పై గేల్ 48 బంతుల్లో) అత్యధిక సెంచరీలు: క్రిస్ గేల్ (2) (2007, 2016) అత్యధిక హాఫ్ సెంచరీలు: విరాట్ కోహ్లి (10) అత్యధిక వ్యక్తిగత స్కోర్: బ్రెండన్ మెక్కల్లమ్ (123) అత్యధిక సగటు: విరాట్ కోహ్లి (76.81) అత్యధిక స్ట్రయిక్ రేట్: డారెన్ స్యామీ (164.12) అత్యధిక సిక్సర్లు: క్రిస్ గేల్ (61) అత్యధిక ఫోర్లు: మహేళ జయవర్ధనే (111) అత్యధిక పరుగులు: మహేళ జయవర్ధనే (31 మ్యాచ్‌ల్లో 1016 పరుగులు) అత్యధిక వికెట్లు: షకిబ్ అల్ హసన్ (31 మ్యాచ్‌ల్లో 41 వికెట్లు) మోస్ట్ డిస్మిసల్: ఎంఎస్ ధోని (21 క్యాచ్ లు, 11 స్టంపింగ్స్) అత్యధిక క్యాచ్‌లు (ఫీల్డర్): ఏబీ డివిలియర్స్ (23) -
చుక్ చుక్ బండి.. దుమ్మురేపింది!
ఐఆర్సీటీసీ: 4 నెలలు... 5 రెట్లు ఐఆర్సీటీసీ... భారతీయ రైల్వేకు చెందిన ఈ కంపెనీ షేరు జోరైన లాభాలతో దూసుకుపోతోంది. గత ఏడాది అక్టోబర్‌లో స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసిన ఈ షేర్... ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలను పంచింది. నాలుగు నెలల్లోనే ఐదు రెట్లు పెరిగింది. ఈ కంపెనీ ఐపీఓకు వచ్చినప్పుడూ, లిస్టింగ్‌లోనూ, ఆ తర్వాత ట్రేడింగ్‌లోనూ రికార్డ్ల మీద రికార్డ్‌లు సృష్టిస్తూ సాగిపోతోంది. ఈ రికార్డ్‌లకు, లాభాల పరుగుకు కారణాలు, షేరు భవిష్యత్తుపై నిపుణుల అంచనాలు తదితర విశేషాలు సాక్షి బిజినెస్ పాఠకుల కోసం... ప్రస్తుతం ఐఆర్సీటీసీ(ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) 4 విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆన్లైన్లో టికెట్లు విక్రయించడం, రైల్వే కేటరింగ్ సర్వీసులు నిర్వహించడం, టూరిజం సర్వీసులు నిర్వహణ, రైల్ నీర్ బ్రాండ్ కింద ప్యాకేజ్డ్ వాటర్‌ను విక్రయించడం. టూరిజం సర్వీసులు కాకుండా మిగిలిన మూడు విభాగాల్లో ఈ కంపెనీదే గుత్తాధిపత్యం. ఇక రైల్వేయేతర కేటరింగ్ సర్వీసులు, ఈ–కేటరింగ్, బడ్జెట్ హోటళ్ల రంగంలోకి కూడా విస్తరిస్తోంది. ఈ బుధవారమే ఈ కంపెనీ క్యూ3 ఫలితాలను వెల్లడించింది. నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ.206 కోట్లకు చేరగా, మొత్తం ఆదాయం 62 శాతం వృద్ధితో రూ.454 కోట్లకు చేరింది. ఒక్కో షేర్‌కు రూ.10 డివిడెండ్‌ను ఇవ్వనుంది. దీనికి రికార్డ్ డేట్‌గా ఈ నెల 25ను నిర్ణయించింది. ఆర్థిక ఫలితాలు అదరగొట్టడంతో ఐఆర్సీటీసీ షేర్ జోరుగా పెరిగింది. గురువారం ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,609ను తాకింది. చివరకు 11% లాభంతో రూ.1,580 వద్ద ముగిసింది. ఇష్యూ ధరతో పోలిస్తే ఐఆర్సీటీసీ షేర్ ధర 400 శాతం పెరగ్గా, ఈ కాలంలో సెన్సెక్స్ 9 శాతమే లాభపడింది. ఐపీఓ... అదిరిపోయే ఆరంభం... గత ఏడాది సెప్టెంబర్ 30, అక్టోబర్ 3ల మధ్య వచ్చిన ఐఆర్సీటీసీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 112 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఇప్పటివరకూ ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఐపీఓ ఈ స్థాయిలో ఓవర్ సబ్‌స్క్రైబ్ కావడం ఇదే మొదటిసారి. రూ.320 ఇష్యూ ధరతో ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ షేరు దాదాపు రెట్టింపు ధరకు రూ.626 వద్ద అక్టోబర్ 14న స్టాక్ మార్కెట్లో లిస్టయింది. లిస్టింగ్ రోజునే రూ.744 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకి రూ.729 వద్ద ముగిసింది. లిస్టింగ్‌లోనూ ఈ షేర్ రికార్డ్‌లే సృష్టించింది. ఒక ప్రభుత్వ రంగ సంస్థకు ఈ స్థాయిలో లిస్టింగ్ లాభాలు రావడం కూడా ఇదే మొదటిసారి. ఐపీఓలో షేర్లు దక్కని వాళ్లు జోరుగా ఈ షేర్లు కొన్నారు. ఆ ఒక్కరోజే రూ.3,500 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఇటీవల కాలంలో మంచి లాభాలు గడించిన ఐపీఓ ఇదే. 23వ స్థానం...: అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రస్తుతం ఈ కంపెనీ 23వ స్థానంలో ఉంది. మార్కెట్ క్యాప్ రూ.25,279 కోట్లు. స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి టాప్50లో కూడా ఈ షేర్ లేదు. ఇప్పుడు ఆయిల్ ఇండియా, భెల్, భారత్ ఎలక్ట్రానిక్స్, న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీలను దాటేసింది. తేజస్‌తో మరింత దూకుడు.. ఈ కంపెనీ తొలి తేజస్ రైలును లక్నో– ఢిల్లీ మార్గంలో ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జనవరి 16న రెండో తేజస్ రైలును అహ్మదాబాద్ – ముంబై సెంట్రల్‌కు ప్రారంభించింది. ఆ రోజే ఈ షేర్ నాలుగంకెల ధరకు చేరింది. ఇక మూడో తేజస్ రైలును త్వరలోనే ఇండోర్– వారణాసి మధ్య నడిపించనుంది. తేజస్ రైళ్ల దూకుడుతో ఈ షేర్ ధర మరింత జోరుగా పెరగనుంది. షేరు ధర ఎందుకు పెరుగుతోందంటే.. ఈ కంపెనీ బిజినెస్ మోడల్ వినూత్నంగా ఉండటం వల్ల షేర్ విలువ మదింపు చేయడం కొంచెం కష్టమేనన్నది నిపుణుల మాట. ఆన్లైన్ టికెట్ల విక్రయం, రైల్వే కేటరింగ్ సర్వీసుల్లో గుత్తాధిపత్యం ఈ కంపెనీదే. అసెట్– లైట్ బిజినెస్ మోడల్‌ను అనుసరిస్తున్న ఈ కంపెనీ ఫ్లోటింగ్ షేర్లు (ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్న షేర్ల సంఖ్య) చాలా తక్కువగా ఉండటం వల్ల డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ధర కూడా పెరిగిపోతూనే ఉంది. ఇటీవలే కేటరింగ్ ఉత్పత్తుల ధరలను పెంచింది. మార్జిన్లు అధికంగా ఉండే తేజస్ రైళ్లను మూడు రూట్లలో నడుపుతోంది. మరిన్ని తేజస్ రైళ్లను తెచ్చే యోచనలో ఉంది. బిజినెస్ మోడల్ నిలకడగా ఉండటం, డివిడెండ్ చెల్లింపులు బాగుండటం (గత మూడేళ్లలో సగటున 50% డివిడెండ్ ఇచ్చింది), రూ.1,100 కోట్ల మేర పుష్కలంగా నగదు నిల్వలు.. ఇవన్నీ సానుకూలాంశాలు. దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఉత్తమ షేరుగా విశ్లేషకులు చెబుతున్నారు. మూడేళ్లలో అమ్మకాలు 23%, లాభం 49% చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. బహుపరాక్.. ఈ షేర్ ధర జోరుగా పెరుగుతోంది. అయితే డెలివరి అయ్యే షేర్ల నిష్పత్తి 11–13 శాతమే ఉంది. డే ట్రేడింగ్ బాగా జరుగుతోందనడానికి ఇది నిదర్శనమన్నది నిపుణుల మాట. మొమెంటమ్ గేమ్ ఆడాలనుకుంటే ఇన్వెస్టర్ల చేతులు కాలవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కంపెనీ వేల్యుయేషన్లు భారీగా పెరిగాయని, కంపెనీ షేరు ధర ఈపీఎస్‌కు 80 రెట్ల వద్ద ట్రేడవుతోందని, ఒకింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంటర్నెట్ ఆధారిత కార్యకలాపాలు నిర్వహించే ప్రైవేట్ కంపెనీలకు ఈ విలువ సమంజసమైనదే. అయితే ఒక ప్రభుత్వ రంగ కంపెనీకి మాత్రం ఈ విలువ చాలా అధికమన్నది వారి విశ్లేషణ. అధిక వేల్యుయేషన్లు ఉండటంతోపాటు, భవిష్యత్తులో ఈ కంపెనీలో మరోవిడత వాటా విక్రయానికి కూడా అవకాశం ఉందని, ఈ రెండూ ప్రతికూలాంశాలని వారంటున్నారు. అయితే మరింత వాటా విక్రయానికి మరో ఏడాది సమయం ఉంది. -
ఒకే స్థలం రెండు సంస్థలకు!
సాక్షి, మంథని : ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఓ పట్టాదారు వద్ద కొనుగోలు చేసిన భూమిని సదరు పట్టాదారు మరలా ఓ ప్రైవేటు సంస్థకు రిజిస్ట్రేషన్ చేసిన ఉదంతం శుక్రవారం వెలుగుచూసింది. మంథని డివిజన్లో నెలకొన్న రెవెన్యూ సమస్యలపై కలెక్టర్ శ్రీ దేవసేన మండలపరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పుట్ట మధు, జిల్లా ఇన్చార్జి డీఆర్వో పద్మయ్య, డివిజన్ పరిధిలోని ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. మంథని మండలం నాగారం శివారులోని సర్వే నంబర్లు 95, 97లోని 17 ఎకరాల భూమిని 1997లో ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసింది. దానిని 17 మంది ఎస్సీలకు పంపిణీ చేసిందని గ్రామానికి చెందిన రైతు బెల్లంకొండ రవీందర్‌రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి కాస్తులో ఉన్న ఎస్సీలు తమ పేర్లను పహణీలో చేర్చాలని, పట్టా పాస్‌పుస్తకాలు ఇవ్వాలని అధికారుల చుట్టు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇదే అదునుగా పట్టాదారు అదే భూమిని ఓ ప్రైవేటు సంస్థకు ఎకరాకు రూ.9 లక్షల చొప్పున 11 ఎకరాలను 2015–16లో అమ్మినట్లు తెలిపారు. సమస్యపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్ తహసీల్దార్ సుధాకర్‌ను వివరణ కోరారు. రెండోసారి అక్రమ పట్టా నిజమేనని చెప్పడంతో వెంటనే సదరు భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ రికార్డుల్లో చూపని కారణమా లేక మరేదో చూడాలని, రిజిస్ట్రేషన్ అథారిటీ, రెవెన్యూ అథారిటీ వేరని, ప్రభుత్వం కొత్తగా రెవెన్యూకే రిజిస్ట్రేషన్ అథారిటీ అప్పగించినందున ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో తలెత్తకపోవచ్చని తెలిపారు. నాగారంలో జరిగిన సమస్యను తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. అక్రమంగా రెండోసారి పట్టా చేసి వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో కేసు వేయాలని ఆదేశించారు. అ భూమిలో ఇప్పటికే పట్టాలు ఇచ్చి ఉంటే వారిలో అర్హులను గుర్తించి పాస్‌పుస్తకాలు జారీ చేయాలని సూచించారు. నెలాఖరులోగా అందరికీ పాస్‌పుస్తకాలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా రైతులందరికీ పట్టాపాస్‌పుస్తకాలు జారీ చేస్తామని కలెక్టర్ తెలిపాçరు. రైతులకు పాస్‌పుస్తకాల పంపిణీ పక్రియ నిరంతరం జరుగుతుందని, ఎవరూ హైరానా పడాల్సిన అవరం లేదన్నారు. జిల్లాలో 1.26 లక్షల మంది రైతులను గుర్తించామని, 1.13 లక్షల పాస్‌పుస్తకాలు ప్రింట్ చేయించామన్నారు. ఇప్పటి వరకు 1.09 లక్షల మంందికి పంపిణీ చేశామని వివరించారు. వివిధ కారణాలతో 12 వేల పాస్ పుస్తకాలు పంపిణీ చేయలేదన్నారు. పంపి ణీ చేసిన పాస్‌పుస్తకాల్లో దొర్లిన తప్పుల సవరణ, కొత్త పాస్‌పుస్తకాల పంపిణీ పక్రియ ను నెలాఖరు వరకు పూర్తి చేస్తామన్నారు. ఇలాంటివి జిల్లాలో 3 వేలు ఉన్నాయని తెలి పారు. గతంలో ఉన్న వెబ్‌లాండ్‌తో అనేక సమస్యలు వచ్చాయని ధరణీ వెబ్సైట్ పకడ్బందీగా ఉందన్నారు. కొత్తగా చేర్చిన సమాచారం ఆన్లైన్లో నమో దు చేసి సెంట్రలైజ్డ్ ప్రింటింగ్ ద్వారా రైతులకు అందిస్తాన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా పార్ట్–ఏ, బీ నమోదు చేశామని పార్ట్–ఏ కింద 94 శాతం పూర్తి చేసామని బీలో కేవలం 6 శాతమే అన్నారు. వివాదాలు, ఫిర్యాదుల ఉన్నవాటిని బీలో చేర్చామని, పరిశీలన, విచారణ అనంతరం అర్హులకు పట్టాలు ఇస్తామని తెలిపారు. నాగారంలో గ్రామం రెవెన్యూ, గ్రామపంచాయతీలో లేకుండా పోవడంతో ఇబ్బందులు ఎదురొంటున్నామని ప్రకాశ్‌రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రామగుండం కార్పొరేషన్‌కు 25 కిలోమీటర్ల దూరంలో గ్రామం ఉండడంతో నిబంధన అడ్డుగా ఉందని తెలిపారు. రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో కాస్తులో ఉన్న భూమి అటవీశాఖవారు తమదని అంటున్నారని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సాదాబైనామాలు చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయ ని డిసెంబర్ 31 వరకు మాత్రమే దరఖాస్తులు తీసుకున్నారని.. తర్వాత తీసుకోవాలని పలువురు కోరారు. అలాగే పీఓటీ కింద వేల సమస్యలు గుర్తించా మని, వీటన్నింటిపై వచ్చే సోమవారం జరిగే సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ రైతుల నుంచి వచ్చిన సమస్యలను క్షుణ్ణంగా పరిశీంచి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామాల్లో తిరుగుతుంటే రెవెన్యూ సమస్యలే ఎక్కువగా వస్తున్నాయని అందుకే ప్రత్యక సమావేశం ఏర్పాటు చేయించా మన్నారు. అధికారులు మానవీయ కోణాన్ని చూడాలని, వారి పరిధిలో ఉన్న వాటిని పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మంథన, ముత్తారం ఎంపీపీలు ఏగోళపు కమల, అత్తె చంద్రమౌళి, కమాన్‌పూర్ జెడ్పీటీసీ, మంథని సర్పంచ్ పుట్ట శైలజ, ఆయా మండలాల తహసీల్దార్లు సమావేశంలో పాల్గొన్నారు. -
చెదలు పట్టిన నోటరీలు!
దస్తావేజులను తినాలంటూ తాము చెదలను ఆహ్వానించలేదని, చెదల వల్ల రికార్డులు దెబ్బతినడం ఒక యాదృచ్ఛిక దైవఘటన అని నోటరీ అధికారులు వాదించారు. ఇది తీవ్ర నిరక్ష్యమేకాదు, నోటరీ చట్టాల ఉల్లంఘన కూడా. తన ఆస్తిని తనకు తెలియ కుండా న్యాయవాది ఎవరికో అమ్మేశాడని, ఆ కాగితాలను ధృవీకరించిన నోటరీ రిజిస్టర్ వివరాలు ఇవ్వాలని, 2008 నుంచి 2013 వరకు ప్రతి సంవత్సరం ధృవీకరించిన మొదటి, చివరి పత్రాల రిజిస్ట్రేషన్ వివరాలు కూడా సమా చార చట్టం కింద తనకు అందించాలని ఒక వ్యక్తి అడి గాడు. ఆ సమాచారం కలిగి ఉన్న నోటరీ న్యాయ వాది మీనా శర్మ దానిని ఇవ్వాలని చట్టాల వ్యవహారాల శాఖ సీపీఐఓ అడిగితే దాన్ని మూడో వ్యక్తి సమాచారం అని చెప్పి ఇవ్వడానికి నిరాకరించారు. ఇక రెండో అప్పీలులో నోటరీ రిజిస్టర్లను చెదలు తినేశాయని కనుక ఇవ్వజా లమని వివరించారు. మొదటి అప్పిలేట్ అధి కారి ముందు చెదల విషయం ప్రస్తావనే లేదు. మొదట మూడో వ్యక్తి సమాచారమనీ, తరువాత చెదలు తిన్న దనీ నిరాకరించడం అనుమానాస్పదం అంటూ సీపీఐఓ తో పాటు అన్ని రిజిస్టర్లతో నోటరీ కూడా తన ముందు హాజరు కావాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. పనికిరాకుండా పోయిన రికార్డుల జాబితాను, మిగి లిన రికార్డుల జాబితాను, సెక్షన్ 4 కింద తమంత తామే ప్రకటించాలని, అప్పుడు ఏ రికార్డులు ఉన్నాయో లేవో పౌరులకు తెలుస్తుందని లేకపోతే అడిగిన ప్రతి కాగితం చెదలకు బలైందని చెప్పి పబ్బం గడుపు కుంటారని, కమిషన్ భావించింది. కనుక చెదలకు పూర్తిగా దెబ్బ తిన్న రిజిస్టర్ల జాబితా, మిగిలిన రిజిస్టర్ల జాబితా, కొంత భాగం దెబ్బతిన్న రిజిస్టర్లు తేవాలని ఆదేశించింది. అందుకు బాధ్యులైన వారిపై విచారణ జరపాలని కమి షన్ ఆదేశించింది. దీంతో సీపీఐఓ తోపాటు నోటరీ మీనా శర్మ కూడా కమిషన్ ముందు హాజరయ్యారు. దెబ్బతిన్న రిజిస్టర్లు, పూర్తిగా ధ్వంసం అయిన రికా ర్డులు, మిగిలినవి కూడా చూపారు. నోటరీ సమర్పించిన వార్షిక నివేదికల కాపీలను ఇచ్చినట్టు వివరించారు. మిగతా వివరాలు చెదలవల్ల ఇవ్వలేదన్నారు. కీలకమైన సాక్ష్య పత్రాలను ధృవీకరించిన వివ రాలను పుస్తకంలో నమోదు చేయవలసిన బాధ్యత నోటరీ న్యాయవాదిపైన ఉంటుంది. రికార్డులు నాశనం అయ్యాయి కనుక అవి లేనట్టేనని, కాబట్టి వాటిని ఇవ్వజాలమన్న వివరణను కమిషన్ అంగీకరించలేదు. రిజిస్టర్లు పాడైనాయని కనుక ఇవ్వలేమనే వాదాన్ని రికార్డుల చట్టం, సమాచార చట్టం, నోటరీ చట్టం అంగీకరించదు. ఆస్తి దస్తావేజులను తదితర కీలకమైన పత్రాలను అధికారికంగా ధృవీకరించే బాధ్యతను చట్టాల శాఖ నోటరీలకు అప్పగించింది. వృత్తిపర మైన అనుచిత ప్రవర్తనకు నోటరీలపై చర్య తీసుకోవ చ్చునని, ఆ నోటరీని తొలగించాలని సెక్షన్ 10 వివరిస్తున్నది. నోటరీలు ధ్రువీకరించడం, దస్తావేజులో నోటింగ్స్ చేయడం, నిరసనలు ఉంటే వాటిని కూడా నమోదు చేయాలని నియమాలు నిర్దేశిస్తున్నాయి. నోటేరియల్ రిజిస్టర్ వారు నిర్వహించాలి. జిల్లా జడ్జి లేదా ఎవరైనా నియమిత అధికారి ఈ రిజిస్టర్లను తనిఖీ చేయవచ్చు. అవి సరిగా లేకపోతే జిల్లా జడ్జి నోటరీపైన చర్య తీసుకోవాలని సంబంధిత అధికారిని కోరవచ్చు. ప్రతి జనవరి నెలలో ప్రభుత్వానికి తన నోటరీ కార్యక్రమాల వార్షిక నివేదిక ఇవ్వాలి. దీన్ని ఫారం 14 రిటర్న్ అంటారు. నోటరీ కార్యక్రమాలకు తగినంత ఫీజును వసూలు చేసే అధికారం నోటరీలకు ఉంది. ఈ ఫీజు లను మార్చి 2014లో పెంచుతూ భారత ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. ప్రపంచంలో కొన్ని దేశాలు నోటరీ దస్తావేజుల రిజిస్టర్లను కంప్యూటరీకరించాయి. దానివల్ల నకిలీ పత్రాలను, అవినీతిని నివారించడానికి వీలుం టుంది. నోటరీలు రికార్డులను ఏ విధంగా కాపాడాలి, ఏ విధంగా తనిఖీకి అనుకూలంగా ఉంచాలి, ఏ విధంగా ప్రతులు ఇవ్వాలనే వివరాలను నోటరీ నమూనా చట్టం వివరించింది. నకిలీ దస్తావేజుల నివారణలో నోటరీలు ప్రభుత్వ ఏజెంట్లుగా న్యాయబద్దంగా వ్యవహరించాలి. రికార్డులు సత్యం ఆధారంగా ప్రమాణీకరించాలి. ఆ వివరాలను చిత్తశుద్ధితో రికార్డుకెక్కించాలి. అధికారులు తాము దస్తా వేజులు తినాలంటూ చెదలను ఆహ్వానించలేదని, చెదల వల్ల రికార్డులు దెబ్బతినడం ఒక యాదృచ్ఛిక దైవఘ టన అని వాదించారు. ఇది తీవ్రమైన నిర్లక్ష్యానికి ప్రతీక అని, నోటరీ రికార్డులను కాపాడడంలో విఫలమై, సమాచార హక్కు చట్టాన్ని, పబ్లిక్ రికార్డు చట్టాన్ని, నోటరీ చట్టాన్ని ఉల్లం ఘించారని కమిషన్ నిర్ధారించింది. నోటరీని పీఐఓగా భావించి 25 వేల రూపాయల జరిమానా విధించింది. నోటరీపైన ఏ చర్యా తీసుకోకపోగా నోటరీ నిర్లక్ష్యాన్ని సమర్థించి, సమాచార నిరాకరణ చేసినందుకు ఎందుకు జరిమానా విధించకూడదో చెప్పాలని చట్టాల శాఖ పీఐఓకు నోటీసు జారీ చేసింది. సమాచార అభ్యర్థికి వేయి రూపాయల పరిహారం నోటరీ న్యాయవాది చెల్లిం చాలని ఆదేశించింది. నోటరీ రికార్డుల రక్షణకు సరైన చర్యలు తీసుకొనేందుకు అంతర్జాతీయ పద్ధతులను అనుసరించి సమగ్ర నోటరీ చట్టాన్ని చేయాలని సిఫార్సు చేసింది. కీలకమైన రికార్డులను చెదలకు అప్పగించే నిర్లక్ష్యం దారుణమైన పాలనకు నిదర్శనమని సమాచార హక్కు చట్టానికి ఇది తీవ్రమైన ఉల్లంఘన అని విమర్శించింది. న్రందలాల్ వర్సెస్ లీగల్ ఐఫైర్స్ డిపార్ట్మెంట్ (CIC/SA/A/2015/001769) కేసులో మే 3న ఇచ్చిన తీర్పు ఆధారంగా వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ - మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com