ఐపీఎల్‌ సృష్టికర్త కుమార్తె.. వేల కోట్లకు వారసురాలు! ఆమె ప్రత్యేకత ఇదే! | Know About The Heiress of Former IPL chairman Lalit Modi Rs 23000 Crore Empire | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ సృష్టికర్త కుమార్తె.. వేల కోట్లకు వారసురాలు! ఆమె ప్రత్యేకత ఇదే!

Published Tue, Jun 18 2024 2:43 PM | Last Updated on Tue, Jun 18 2024 3:35 PM

Know About The Heiress of Former IPL chairman Lalit Modi Rs 23000 Crore Empire

ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన టీ20 లీగ్‌గా పేరొందింది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ సృష్టికర్త లలిత్‌ కుమార్‌ మోదీ. సినీ సెలబ్రిటీలు, కార్పొరేట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించి.. ప్రపంచ క్రికెటర్లందినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చిన ఘనత సొంతం చేసుకున్నాడు ఈ బిజినెస్‌మేన్‌.

అప్పటి వరకు ఎన్ని వ్యాపారాలు ఉన్నా ఐపీఎల్‌తోనే పాపులర్‌ అయిన లలిత్‌ మోదీ.. క్రికెట్‌ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగాడు. అయితే, ఆర్థిక లావాదేవీల విషయంలో అవకతవలకు పాల్పడి అదే స్థాయిలో అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. దేశం నుంచి పారిపోయి ఆర్థిక నేరగాడిగా ముద్రవేసుకున్నాడు.

ఆ మధ్య సుస్మితా సేన్‌తో ప్రేమాయణంతో మళ్లీ వార్తల్లోకి వచ్చిన లలిత్‌ మోదీ.. ఇటీవల టీ20 ప్రపంచకప్‌-2024లో ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ టికెట్‌ రేట్ల విషయమై ఐసీసీని విమర్శిస్తూ తెరమీదకు వచ్చాడు.

ఈ నేపథ్యంలో లలిత్‌ మోదీ  వ్యక్తిగత జీవితం, నెట్‌వర్త్‌, ఆయన వారసుల గురించి తాజాగా నెటిజన్లలో చర్చ మొదలైంది. తనకంటే వయసులో తొమ్మిదేళ్లు పెద్దదైన మినాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న లలిత్‌ మోదీకి కుమార్తె అలియా, కుమారుడు రుచిర్‌ ఉన్నారు.

DNA ఇండియా నివేదిక ప్రకారం.. జూలై 2022 నాటికి లలిత్‌ మోదీ నికర ఆస్తుల విలువ 4,555 కోట్ల రూపాయలు. ఇక ఆయనకు సంబంధించిన మోది ఎంటర్‌ప్రైజెస్‌ విలువ రూ. 23,450 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.

అలియా మోదీ.. ఆసక్తికర నేపథ్యం
లలిత్‌ మోదీ ఆస్తులకు వారసురాలైన అలియాకు తన తమ్ముడు రుచిర్‌తో మంచి అనుబంధం ఉంది. తోబుట్టువులిద్దరు ఒకరికి ఒకరు అండగా ఉంటూ.. వ్యాపారంలో రాణిస్తున్నారు.

అలియా మోదీ ఇంటీరియర్‌ డిజైనర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సొంతంగా రూ. 41 కోట్ల మేర ఆస్తి కలిగి ఉన్నట్లు సమాచారం. ఇక అలియా వ్యక్తిగత జీవితానికొస్తే.. 2022 మేలో ఆమె బ్రెట్‌ కార్ల్‌సన్‌ను పెళ్లి చేసుకున్నారు.

ఇటలీలోని వెనిస్‌ నగరంలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో కూతురు- అల్లుడి ఫొటోలను షేర్‌ చేస్తూ లలిత్‌ మోదీ మురిసిపోయాడు. ఇక సెలబ్రిటీల జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న నెటిజన్లు ఈ ఫొటోలను తవ్వితీసి.. అలియా మోదీని హైలైట్‌ చేస్తున్నారు. అదీ.. ఐపీఎల్‌ సృష్టికర్త లలిత్‌ మోదీ కుటుంబం సంగతి! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement