Sheldon Jackson: తండ్రైన కేకేఆర్‌ బ్యాటర్‌.. కుమారుడి ఫోటో షేర్‌ చేసి..

KKR Player Sheldon Jackson Blessed With Baby Boy Shares Photos - Sakshi

సౌరాష్ట్ర వెటరన్‌ వికెట్‌ కీపర్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాటర్‌ షెల్డన్‌ జాక్సన్‌ అభిమానులతో శుభవార్త పంచుకున్నాడు. తమకు మంగళవారం మగ బిడ్డ జన్మించినట్లు తెలిపాడు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా చిన్నారి కుమారుడిని చేతుల్లోకి తీసుకున్న ఫొటోను షేర్‌ చేశాడు. ఈ సందర్భంగా అభిమానులు షెల్డన్‌ జాక్సన్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కేకేఆర్‌ సైతం లిటిల్‌ నైట్‌కు క్లబ్‌లోకి స్వాగతం అంటూ జాక్సన్‌ను విష్‌ చేసింది. కాగా దేశవాళీ క్రికెట్‌లో రాణించినప్పటికీ 35 ఏళ్ల షెల్డన్‌ జాక్సన్‌కు ఇంత వరకు టీమిండియాలో చోటు దక్కలేదు. దీంతో తాను నిరాశకు గురైనట్లు జాక్సన్‌ గతంలో పలు సందర్భాల్లో వెల్లడించాడు. 

ఒకానొక సమయంలో తాను ఈ విషయం గురించి ఒకరిద్దరిని అడుగగా.. తనకు వయసైపోయిందన్నారని, అందుకే బీసీసీఐ నుంచి పిలుపు రావడం లేదన్నారని పేర్కొన్నాడు. అయితే, అదే సమయంలో 30 ఏళ్లు పైబడిన వారిని జట్టుకు ఎంపిక చేయడం చూశానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా 2011లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన షెల్డన్‌ జాక్సన్‌ 79 మ్యాచ్‌లు ఆడాడు. 5947 పరుగులు సాధించాడు.

ఇందులో 19 సెంచరీలు ఉన్నాయి. ఇక లిస్ట్‌ ఏ క్రికెట్‌లో 67 మ్యాచ్‌లలో 2346 పరుగులు చేశాడు. అదే విధంగా పొట్టి ఫార్మాట్‌లో 1534 పరుగులు సాధించాడు. ఇందులో సెంచరీ కూడా ఉండటం విశేషం. ఇక ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు షెల్డన్‌ జాక్సన్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

చదవండి: Surya Kumar Yadav: ప్రస్తుతం అతడిని ఎదుర్కోగల బౌలర్‌ ప్రపంచంలోనే ఎవరూ లేరు!
Ind Vs Eng 1st ODI: కోహ్లి లేడు.. బుమ్రా, సిరాజ్‌ను కాదని అర్ష్‌దీప్‌ సింగ్‌కు ఛాన్స్‌! ఇంకా..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top