శ్రీకాంత్‌ ముందంజ | Kidambi Srikanth is off to a good start | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్‌ ముందంజ

Feb 1 2024 4:01 AM | Updated on Feb 1 2024 4:01 AM

Kidambi Srikanth is off to a good start - Sakshi

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, శంకర్‌ ముత్తుస్వామి, మిథున్‌ మంజునాథ్‌ శుభారంభం చేశారు. సమీర్‌ వర్మ, కిరణ్‌ జార్జి తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు.

బుధవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ప్రపంచ 24వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 45 నిమిషాల్లో 22–20, 21–19తో ప్రపంచ 26వ ర్యాంకర్‌ వాంగ్‌ జు వె (చైనీస్‌ తైపీ)పై గెలుపొందగా... శంకర్‌ 21–14, 21–17తో లియోంగ్‌ జున్‌ హావో (మలేసియా)ను, మిథున్‌ 21–17, 21–8తో జేసన్‌ (హాంకాంగ్‌)ను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.

మరో మ్యాచ్‌లో సమీర్‌ వర్మ 14–21, 18–21తో లాంగ్‌ అంగుస్‌ (హాంకాంగ్‌) చేతిలో ఓడిపోగా... లె లాన్‌ జి (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో కిరణ్‌ జార్జి తొలి గేమ్‌ను 17–21తో కోల్పోయాక గాయంతో వైదొలిగాడు. మహిళల సింగిల్స్‌లో అషి్మత, మాళవిక ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టగా... హైదరాబాద్‌ అమ్మాయి సామియా తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది.

అష్మిత 21–10, 21–16తో వాంగ్‌ లింగ్‌ చింగ్‌ (మలేసియా)పై, మాళవిక 22–20, 21–8తో ఇనెస్‌ (పెరూ)పై నెగ్గగా... సామియా 14–21, 18–21తో బుసానన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement