సీజన్‌లో రెండో సెంచరీ అందుకున్న బట్లర్‌.. పలు రికార్డులు బద్దలు | Jos Buttler 2nd Century IPL 2022 Season Vs KKR Breaks Many-IPL Records | Sakshi
Sakshi News home page

IPL 2022: సీజన్‌లో రెండో సెంచరీ అందుకున్న బట్లర్‌.. పలు రికార్డులు బద్దలు

Apr 18 2022 9:19 PM | Updated on Apr 18 2022 9:26 PM

Jos Buttler 2nd Century IPL 2022 Season Vs KKR Breaks Many-IPL Records - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జాస్‌ బట్లర్‌ రెండో సెంచరీ సాధించాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో బట్లర్‌ 59 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. పాట్‌ కమిన్స్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ తొలి బంతిని లాంగాన్‌ దిశగా భారీ సిక్సర్‌ బాది బట్లర్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే సెంచరీ చేసిన కాసేపటికే బట్లర్‌ 103 పరుగుల వద్ద పాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ సీజన్‌లో తొలి సెంచరీని ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అందుకున్నాడు. తాజా సెంచరీతో బట్లర్‌ పలు రికార్డులు బద్దలు కొట్టాడు.

►ఐపీఎల్‌ 2022లో రెండో సెంచరీ అందుకున్న బట్లర్‌కు ఓవరాల్‌గా ఐపీఎల్‌లో మూడో సెంచరీ
►ఇక గత 23 టి20 ఇ‍న్నింగ్స్‌ల్లో బట్లర్‌కు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం.
►ఇక గత ఏడు ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లో బట్లర్‌ మూడుసార్లు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
►ఐపీఎల్‌లో భాగంగా బ్రబౌర్న్‌ స్టేడియంలో సెంచరీ బాదిన నాలుగో ఆటగాడిగా బట్లర్‌ రికార్డు అందుకున్నాడు. ఇంతకముందు యూసఫ్‌ పఠాన్‌, షేన్‌ వాట్సన్‌, కేఎల్‌ రాహుల్‌ ఈ ఘనత అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement