వ‌ర‌ల్డ్ నెం1 బౌల‌ర్‌గా జ‌స్ప్రీత్ బుమ్రా.. | Jasprit Bumrah returns to No. 1 spot after Perth Test heroics | Sakshi
Sakshi News home page

ICC Rankings: వ‌ర‌ల్డ్ నెం1 బౌల‌ర్‌గా జ‌స్ప్రీత్ బుమ్రా..

Nov 27 2024 4:12 PM | Updated on Nov 27 2024 4:28 PM

Jasprit Bumrah returns to No. 1 spot after Perth Test heroics

టీమిడియా పేస్ గుర్రం జ‌స్ప్రీత్ బుమ్రా మ‌రోసారి వ‌ర‌ల్డ్ నెం1 టెస్టు బౌల‌ర్‌గా నిలిచాడు. ఐసీసీ తాజాగా ప్ర‌క‌టించిన టెస్టు బౌల‌ర్ల ర్యాకింగ్స్‌లో బుమ్రా తిరిగి త‌న‌ అగ్ర‌పీఠాన్ని ఆదోరిహంచాడు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టివ‌ర‌కు టాప్ ర్యాంక్‌లో కొన‌సాగిన‌ ద‌క్షిణాఫ్రికా స్టార్ పేస‌ర్ క‌గిసో ర‌బాడ‌ను బుమ్రా వెన‌క్కి నెట్టాడు. 

బుమ్రా టెస్టుల్లో నంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌కు చేరుకోవ‌డం ఇది ఈ ఏడాదిలో రెండో సారి కావ‌డం గ‌మ‌నార్హం. కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రా మూడో స్ధానంలో ఉన్నాడు.

అయితే పెర్త్ వేదిక‌గా ఆసీస్‌తో జ‌రిగిన తొలి టెస్టులో ఎనిమిది వికెట్లతో స‌త్తాటాటిన బుమ్రా.. 883 పాయింట్ల‌తో రబడ, జోష్ హేజిల్‌వుడ్‌ను ఆధిగిమించి మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇంత‌కుముందు ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో టెస్టు బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో బుమ్రా నెం1గా నిలిచాడు. 

మ‌రోవైపు భార‌త స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ మూడు స్దానాలు ఎగ‌బాకి 25వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అదే విధంగా ఆసీస్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ రెండు స్ధానాలు దిగ‌జారి ఆరో ర్యాంక్‌కు ప‌డిపోయాడు.

పెర్త్‌లో బుమ్ బుమ్‌..
కాగా ఆసీస్‌తో జ‌రిగిన తొలి టెస్టులో జ‌స్ప్రీత్ బుమ్రా సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో జట్టుకు నాయకత్వం వహించిన బుమ్రా.. కెప్టెన్సీతో పాటు వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న ప‌రంగా అద‌ర‌గొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు ప‌డ‌గొట్టిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు ప‌డ‌గొట్టి స‌త్త‌చాటాడు. మొత్తంగా 8 వికెట్లు సాధించి ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.
చదవండి: IPL 2025: 'నిజంగా నేను ఆశ్చర్యపోయాను.. థాం‍క్యూ ముంబై ఇండియన్స్‌'

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement