WTC Final 2023: Ravindra Jadeja, Shubman Gill, Ajinkya Rahane reach London for Ind vs Aus clash - Sakshi
Sakshi News home page

WTCFinal2023: ఇంగ్లండ్‌ గడ్డపై అడుగుపెట్టిన ఆ ఐదుగురు! ఫోటోలు వైరల్‌

May 31 2023 3:19 PM | Updated on May 31 2023 3:41 PM

Jadeja, Shubman Gill, Ajinkya Rahane reach London for IND vs AUS clash - Sakshi

రెండు నెలల పాటు అభిమానులను ఉర్రుతూలగించిన ఐపీఎల్‌-2023కు సోమవారంతో శుబం కార్డు పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు మరో ఉత్కంఠపోరు సిద్దమైంది. లండన్‌ వేదికగా జూన్‌ 7నుంచి జరగనున్న వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా-భారత జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.

టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడం ఇది వరుసగా రెండో సారి. డబ్ల్యూటీసీ-2021 ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో భారత జట్టు ఓటమి పాలైంది. దీంతో ఈ ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరగన్న ఫైనల్లో ఎలాగైనా విజయం సాధించి.. ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలని టీమిండియా భావిస్తోంది. ఇక ఈ తుదిపోరు కోసం ఇప్పటికే రెండు బ్యాచ్‌లుగా లండన్‌కు చేరుకున్న రోహిత్‌ సేన.. ప్రాక్టీస్‌లో మునిగి తేలుతోంది.

మరోవైపు ఈ ఫైనల్‌ కోసం టీమిండియా మూడో బ్యాచ్‌ కూడా ఇంగ్లడ్‌ గడ్డపై అడుగుపెట్టింది. అజింక్యా రహానే, కేఎస్ భరత్, శుభ్‌మన్ గిల్, షమీ, రవీంద్ర జడేజాలతో కూడిన చివరి బ్యాచ్‌ బుధవారం లండన్‌కు చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను శ్రీకర భరత్‌, రహానే సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కాగా ఐపీఎల్‌-2023 ఫైనల్‌ కారణంగా ఈ ఐదుగురి ప్రయాణం ఆలస్యమైంది. 


చదవండి: #MS Dhoni: కోకిలాబెన్‌ హాస్పిటల్‌కు వెళ్లనున్న ధోని.. ఎందుకంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement