రష్మిక జోడీ ఓటమి.. అంకిత జోడీ క్వార్టర్స్‌కు  | ITF Womens Tourney: Rashmika, Sahaja Pairs Quits In First Round | Sakshi
Sakshi News home page

రష్మిక జోడీ ఓటమి.. అంకిత జోడీ క్వార్టర్స్‌కు 

Mar 8 2023 8:31 AM | Updated on Mar 8 2023 8:31 AM

ITF Womens Tourney: Rashmika, Sahaja Pairs Quits In First Round - Sakshi

బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నీ డబుల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ క్రీడాకారిణులు భమిడిపాటి శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లిలకు నిరాశ ఎదురైంది.

మంగళవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో రష్మిక–వైదేహి (భారత్‌) ద్వయం 6–7 (5/7), 7–5, 5–10తో హెసీ అమండైన్‌ (ఫ్రాన్స్‌)–దాలియా జకుపోవిచ్‌ (స్లొవేనియా) జోడీ చేతిలో... సహజ–సోహా సాదిక్‌ (భారత్‌) ద్వయం 4–6, 6–7 (3/7)తో ఎలీనా టియోడోరా (రొమేనియా)–డయానా మర్సిన్‌కెవికా (లాత్వియా) జోడీ చేతిలో ఓడిపోయాయి.

రెండో సీడ్‌ అంకిత రైనా–రుతుజా భోస్లే (భారత్‌) ద్వయం 5–7, 6–3, 10–6తో షర్మదా బాలు (భారత్‌)–సారా రెబెకా (జర్మనీ) జోడీని ఓడించి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement